‘వీర్ సావర్కర్’ కథతో నిఖిల్ నటిస్తున్న ‘ది ఇండియా హౌజ్’తో పాటు బాలీవుడ్ మరో సినిమా కూడా తెరకెక్కుతోంది. బాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న యాక్టర్స్ లో రణదీప్ హుడా ఒకరు. ఎన్నో సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేసి గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న రణదీప్ హుడా మొదటిసారి డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’. ఈ ఏడాదే ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ టీజర్ ని మేకర్స్ ఇటీవలే ‘వీర్ సావర్కర్ 140వ జయంతి’ నాడు రిలీజ్ చేసారు.
భగత్ సింగ్, కుదిరామ్ బోస్ లాంటి లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ నే ప్రేరేపించిన గొప్ప నాయకుడు సావర్కర్. అలాంటి నాయకుడి కథని ఎవరు చంపేశారు? ఎందుకు చంపేసారు అంటూ రణదీప్ హుడా ‘సావర్కర్’ టీజర్ ని సూపర్బ్ గా ప్రెజెంట్ చేసాడు. టీజర్ లో రణదీప్ హుడా ‘సావర్కర్’ పాత్ర కోసం పడిన కష్టం కనిపిస్తోంది. టీజర్ తో అంచనాలు పెంచిన రణదీప్ హుడా, వీర్ సావర్కర్ షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసాడు. గత ఏడాదిన్నరగా ఈ సినిమాతోనే ట్రావెల్ అవుతున్న రణదీప్ హుడా, షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ఎమోషనల్ అయ్యాడు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఇదే సమయంలో నిఖిల్ నటిస్తున్న ‘ది ఇండియా హౌజ్’ సినిమాకి ‘సావర్కర్’ సినిమాకి మధ్య పోలికలు ఉంటాయా? రెండూ ఒకే కథతో తెరకెక్కుతున్నాయా అనేది చూడాలి. ఇప్పటికైతే రెండు సినిమాలు ఒకరి పేరుతోనే ప్రమోట్ అవుతున్నాయి… ‘వీర్ సావర్కర్’.
It's a wrap for #VeerSavarkar. I have been to death and back for this film but that is a topic for another day. For now, big heartfelt thanks to my team, cast and crew, to have rallied day and night behind me through thick and thin and made it happen. Finally now I can eat… pic.twitter.com/2ajqfiLb4S
— Randeep Hooda (@RandeepHooda) June 22, 2023