Tapsee Pannu: బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సనవసరం లేదు. ఇటీవలే శభాష్ మిథు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమ్మడు పాపం అపజయాన్నిమూటగట్టుకొంది. అయినా వెనుతిరగకుండా మరో విజయం కోసం కసితో ముందుకు దూసుకెళ్తోంది. ప్రస్తుతం తాప్సీ నటించిన దోబారా చిత్రం ఆగస్టు 19 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన తాప్సీ.. అనుకోకుండా ఒక వివాదంలో చిక్కుకొంది. బాలీవుడ్ లో పాపరాజిస్ తో గొడవకు దిగింది. దీంతో అమ్మడిపై నెటిజన్లు గుర్రుమంటున్నారు. హీరో హీరోయిన్లు ఎవ్వరైనా వారికి పబ్లిసిటీ కావాలంటే ఫొటోగ్రాఫర్లు(పాపరాజిస్) ఎంతో ముఖ్యం. సెలబ్రిటీలను ఎంతో అందంగా ఫోటోలు తీసి అభిమానులకు చూపిస్తారు కాబట్టే హీరోహీరోయిన్లకు అంత ఫేమ్ వస్తుంది. అలాంటివారితో వాగ్వాదానికి దిగిందిసొట్టబుగ్గల సుందరి. ఇంతకూ విషయం ఏంటంటే.. ముంబైలో తన సినిమా ప్రమోషన్స్ కు అటెంట్ అయిన తాప్సీ గుమ్మం దగ్గర కెమెరా మ్యాన్ లను, ఫొటోగ్రాఫర్లను పట్టించుకోకుండా లోపలి వెళ్లిపోయింది. వెనుక నుంచి వారు తాప్సీ మేడం .. ఇప్పటికే లేటుగా వచ్చారు .. కొద్దిగా ఆగి వెళ్లండి.. అని అరుస్తున్నా పట్టించుకోకుండా ఆమె లోపలి వెళ్ళిపోయింది. ఇక అనంతరం బయటికి వచ్చిన తాప్సీ, మీడియాతో వాగ్వాదానికి దిగింది.
“నేను లేటుగా రాలేదు.. నా సమయం ప్రకారం నేను వచ్చాను.మీరు నేనేం తప్పు చేశానని నన్ను తిడుతున్నారు” అంటూ ఫైర్ అయ్యింది. అందుకు వారు మేము నాలుగు గంటల నుంచి మీకోసం ఎదురుచూస్తున్నామని, తమను పట్టించుకోకుండా పిలుస్తున్నా వినపడనట్లు వెళ్లిపోవడం ఏంటని అడిగారు. “అందులో నా తప్పు ఏముంది..? నా పని నేను చేసుకున్నాను ..వెళ్ళిపోతున్నాను” అమీ బదులిచ్చింది. ఫోటోగ్రాఫర్స్ గట్టిగా రెండు గంట నుంచి వెయిట్ చేస్తున్నాం అని అరిచారు. “దయచేసి నాతో మర్యాదగా మాట్లాడండి.. మీరు నాతో మర్యాదగా మాట్లాడితే.. నేను మీకు మర్యాద ఇచ్చి మాట్లాడతాను” అంటూ వాగ్వాదానికి దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక తాప్సీ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమెకు ఎందుకు అంత పొగరు..? అంటూ కామెంట్స్ చేసున్నారు. మరి ఈ వివాదం తాప్సీ సినిమాపై ప్రభావం పడుతుందేమో చూడాలి.
