Site icon NTV Telugu

‘ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్’ కామెంట్‌కి తాప్సీ కౌంటర్

ప్రస్తుతం భారతీయ సినిమాలలో ఫిమేల్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్‌ లకు ముందుగా వినిపించే పేరు తాప్సీ. ఆ సినిమాలే అమ్మడిని అగ్ర నటిగా నిలబెట్టాయని చెప్పవచ్చు. అయితే కొంత మంది విమర్శకులు మాత్రం ఇలా మూస పాత్రలు చేసుకుంటూ పోతే తాప్పీకి దీర్ఘకాలం కెరీర్‌లో కొనసాగలేదనే కామెంట్ చేస్తున్నారు. అలాంటి వారికి తాప్సీ గట్టిగానే బదులిస్తోంది. ఆ మూస పాత్రల పోషణలో నా కెరీర్ బాగానే సాగుతోంది. ఎవరో కొందరు విమర్శకులను సంతృప్తి పరచడం కోసం నాకు ప్రాధాన్యత లేని, సాత్వికమైన, బలహీనమైన పాత్రలను ఎట్టిపరిస్థితిలో అంగీకరించను. అలాంటి వారి విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వను. అసలు వారిని కేర్ కూడా చేయను అంటోంది.

Exit mobile version