Site icon NTV Telugu

Veerabhadram Chowdary: నరేశ్‌ అగస్త్య సరసన శ్వేత అవస్తి!

Swetha Avasthi

Swetha Avasthi

‘పూలరంగడు, చుట్టాలబ్బాయి’ లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో ‘మత్తు వదలారా, సేనాపతి’ చిత్రాలతో ప్రసంశలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా ఇటీవలే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. డెక్కన్ డ్రీమ్ వర్క్స్, జయదుర్గాదేవి మల్టీమీడియా బ్యానర్లపై నబిషేక్, తూము నర్సింహా పటేల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. క్రైమ్ కామెడీ జోనర్ లో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రానికి సంబధించిన లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.. ఈ చిత్రంలో ‘మెరిసే మెరిసే’ ఫేమ్ శ్వేత అవస్తి కథానాయికగా నటించబోతోంది.

ఈ నెలలో ప్రారంభం కానున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ షూట్‌లో శ్వేత అవస్తి జాయిన్ కానున్నారు. ఈ చిత్రం కోసం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశామని దర్శకుడు వీరభద్రమ్ చౌదరి తెలిపారు. ‘మెలోడీ స్పెషలిస్ట్ అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారని, మరికొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో కనిపించనున్నార’ని చెప్పారు. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు నిర్మాతలు.

Exit mobile version