ప్రజెంట్ నిఖిల్ చేతిలో స్వయంభు, ద ఇండియా హౌజ్ చిత్రాలున్నాయి. ఈ రెండు కూడా పీరియడిక్ చిత్రాలే. వాటిలో స్వయంభు సినిమాను దాదాపు రెండేళ్ల క్రితమే స్టార్ట్ చేశాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ యోధుడిగా కనిపించనున్నాడు. తన కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా స్వయంభు వస్తుందని స్వయంగా నిఖిల్ తెలిపాడు. ఇక ఈ సినిమా కోసం కత్తి యుద్దాలు గుర్రపు స్వారీలలో శిక్షణ కూడా తీసుకున్నాడు. చాలా కాలంగా షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది ఫ్రిబ్రవరి 13న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెట్టనుందని ఆ మధ్య ప్రకటించారు మేకర్స్.
Also Read : Prabhas : న్యూ ఇయర్ కానుకగా ప్రభాస్ ఫ్యాన్స్ కు ‘కల్కి 2’ అప్డేట్.
కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఫిబ్రవరిలో ఈ సినిమా వచ్చే అవకాశం లేనట్టు కనిపిస్తోంది. న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. కానీ ఈ పోస్టర్ లో రిలీజ్ డేట్ ను తీసేసారు. గతంలో విడుదల చేసిన పోస్టర్స్ లో రిలీజ్ డేట్ ఇచ్చిన మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్ లేకుండానే పోస్టర్ రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమా మరోసారి వాయిదా వేసే ఛాన్స్ ఉందని వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. కార్తీకేయ2తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టింది నిఖిల్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఆ తర్వాత చేసిన స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రాలు డిజాస్టర్లు టాక్ తెచ్చుకోవడంతో స్వయంభు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి స్వయంభు చెప్పిన డేట్ కు వస్తుందా పోస్ట్ పోన్ అవుతుందో లేదో చూడాలి.
