Swara Bhasker కు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించింది. బాలీవుడ్ బ్యూటీ స్వర భాస్కర్ ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో ఉన్నారు. అయితే ఆమెకు అక్కడి క్యాబ్ డ్రైవర్ అనుకోని షాక్ ఇచ్చాడు. షాపింగ్ చేసిన తర్వాత స్వర ఒక క్యాబ్‌ను అద్దెకు తీసుకుంది. అయితే ఆ క్యాబ్ డ్రైవర్ మాత్రం అనుకోని విధంగా ఆమె వస్తువులను దొంగిలించడంతో ఖంగుతినడం హీరోయిన్ వంతయ్యింది. ఆ అనుకోని పరిణామానికి ఎలా స్పందించాలో అర్థంకాని స్వర భాస్కర్ ఆ డ్రైవర్ ఘనతను సోషల్ మీడియాలో వేదికగా వెల్లడించింది.
Read Also : Aishwaryaa Rajinikanth : ఇక కలిసే ఛాన్స్ లేదు… సైలెంట్ గా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ డాటర్
“హే @Uber_Support నేను లాస్ ఏంజిల్స్ లో ప్రీ యాడెడ్ స్టాప్‌లో ఉండగా, మీ డ్రైవర్‌లలో ఒకరు అతని కారులో నా కిరాణా సామాగ్రి మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు. మీ యాప్‌లో దీన్ని నివేదించడానికి మార్గం లేదు. ఇది పోగొట్టుకున్న అంశం కాదు! అతను తీసేసుకున్నాడు. దయచేసి నేను నా వస్తువులను తిరిగి పొందవచ్చా? #పర్యాటక సమస్యలు” అంటూ ఉబెర్ యాజమాన్యానికి తన గోడును వెళ్లబోసుకుంది. ఆమె ట్వీట్ కు వెంటనే స్పందించిన ఉబర్ సపోర్ట్ ఈ తప్పును సరిదిద్దడంలో సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. దేశంలోనే కాదు దేశం కానీ దేశం వెళ్లినా సామాన్యులతో పాటు సెలెబ్రెటీలకు కూడా టూరిస్ట్ కష్టాలు తప్పవనడానికి ఈ సంఘటనే నిదర్శనం. మరి అతను స్వర వస్తువులను పొరపాటుగా తీసుకెళ్లాడా ? లేదంటే కావాలనే దొంగతనం చేశాడో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉబెర్ యజమాన్యానిదే !
