NTV Telugu Site icon

Swara Bhasker: పెళ్లి అయిన నాలుగు నెలలకే ఆరు నెలల ప్రెగ్నెంట్.. అందుకేనా సీక్రెట్ పెళ్లి

Swara

Swara

Swara Bhasker: బాలీవుడ్ నటి స్వర భాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కొనితెచ్చుకోవడంలో అమ్మడి తరువాతేనే ఎవరైనా..ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె సమాజ్ వాదీ పార్టీ నేత ఫహాద్ జిరార్ అహ్మద్‌ను సీక్రెట్ గా వివాహం చేసుకుంది. రిజిస్టర్ ఆఫీస్ లో ఆమె పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చింది. పెళ్ళై మూడు నెలలు కాగానే ఈ చిన్నది అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను గర్భవతిని అని తెలుపుతూ భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ” కొన్నిసార్లు మన ప్రార్థనలు అన్నీ ఫలిస్తాయి. భగవంతుడు మన ప్రార్థనలకు సమాధానం ఇస్తారు. మేం కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం. ఇదొక గొప్ప అనుభూతి. ఎగ్జైటెడ్ గా ఉన్నాం” అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అయితే ఆ ఫొటోల్లో ఆమె బేబీ బంప్.. ఆరునెలలు తరువాత ఉండే ప్రెగ్నెంట్ లేడీలా ఉండడంతో నెటిజన్స్ విస్తుపోతున్నారు.

Lust Stories 2: తమన్నా- విజయ్ వర్మల లస్ట్ స్టోరీ.. బెడ్ పై ముద్దులు..

ఇదేంటి నాలుగో నెలలోనే అంత పెద్ద బేబీ బంప్.. నిజంగా నాలుగో నెలేనా నఅని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది. పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయ్యిందని, అందుకే అంత సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నారని చెప్పుకొస్తున్నారు. మరికొందరు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ బేబీ బంప్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే స్వర భాస్కర్.. రచయిత హిమాన్షు శర్మతో కొన్నాళ్ళు ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. ‘రాంఝనా’ చిత్రీకరణలో వీరి పరిచయం ప్రేమకు దారితీసి సహజీవనం వరకు వెళ్ళింది. కొన్ని విభేదాల వలన ఈ ప్రేమ పక్షులు విడిపోయారు.