మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తెలంగాణ బార్డర్ దాటి ఆంధ్రాలో అడుగుపెట్టి చేస్తున్న సినిమా ‘గాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంజలీ కీ రోల్ ప్లే చేస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో హీరోయిన్ గా నేహా శెట్టి నటిస్తోంది. ఇటీవలే ఫస్ట్ లుక్ అండ్ టీజర్ తో హైప్ పెంచిన మేకర్స్… గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్స్ కి కిక్ స్టార్ట్ ఇచ్చారు. తెలంగాణ స్లాంగ్ లో డైలాగులు చెప్పే విశ్వక్ సేన్ మొదటిసారి గోదావరి యాసలో మాట్లాడుతూ ఇంప్రెస్ చేసాడు. విశ్వక్ లుక్ కూడా చాలా మాసీగా ఉంది, ఇంతక ముందు కూడా విశ్వక్ మాస్ హీరోగా కనిపించాడు కానీ ఇంత రగ్గడ్ గా కనిపించడం ఇదే మొదటిసారి. టీజర్ లో యువన్ శంకర్ రాజా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా యువన్ సాంగ్ తో తన మ్యాజిక్ చూపించడానికి రెడీ అయ్యాడు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలోని మొదటి సాంగ్ “సుట్టంలా సూసి”ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. ఆగస్టు 16న బయటకి రానున్న ఈ సాంగ్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ సాంగ్ లో విశ్వక్ చాలా రఫ్ గా కనిపిస్తే, నేహా శెట్టి లుక్ కూడా చాలా బాగుంది, ట్రెడిషనల్ గా కనిపించి నేహా ఇంప్రెస్ చేసింది. “సుట్టంలా సూసి పోమాకే, సుట్టేసుకోవే చీరలా” అంటూ శ్రీహర్ష రాసిన లిరిక్స్ బాగుంది. అనురాగ్ కులకర్ణి ప్రోమోలోనే తన వాయిస్ తో మెప్పించాడు. ఫుల్ సాంగ్ బయటకి వస్తే సుట్టంలా సూసి సాంగ్ కి చాలా మంచి రెస్పాన్స్ రావడం గ్యారెంటీ. మరి దాసన్న మాస్ ప్రేమ్ కహాని ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.
Here’s the promo of #SuttamlaSoosi song from #GangsofGodavari 💞🌊
Full song out Tomorrow! ❤️
A @thisisysr magical melody 🎶 🎹
🎤 @anuragkulkarni_
✍️ @SriharshaEmani @VishwakSenActor @iamnehashetty @yoursanjali #KrishnaChaitanya @vamsi84… pic.twitter.com/BkgLr2ePTk— VishwakSen (@VishwakSenActor) August 15, 2023