Susmitasen: పెళ్లి కాలేదు.. ఎంగేజ్‌మెంట్ కాలేదు.. లలిత్ మోదీ ట్వీట్లపై సుస్మిత క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సృష్టికర్త లలిత్ మోదీ, మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్‌తో ఉన్న సంబంధంపై చేసిన ట్వీట్లు గురువారం రాత్రి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తొలుత ఇరువురు కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నట్లు గురువారం ట్వీట్ చేసిన లలిత్ మోదీ.. ఆ తర్వాత కాసేపటికే వెళ్లి మాత్రం ఇప్పుడు కాదని మరో ట్వీట్ చేశారు. ఇప్పుడు డేటింగ్‌లో ఉన్నామంటూ తెలిపారు. అంతేకాకుండా ఏదో ఒక రోజు పెళ్లి కూడా జరిగి తీరుతుందంటూ ఆయన ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా నిమిషాల వ్యవధిలోనే లలిత్ ట్వీట్లు చేసి.. ఓ వైపు బాలీవుడ్ వర్గాలతో పాటు క్రీడావర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ ట్వీట్లపై బాలీవుడ్ నటి సుస్మితా సేన్ క్లారిటీ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె స్పందించింది.
లలిత్ మోదీ పేరును ప్రస్తావించకుండా అసలు విషయాన్ని సుస్మితాసేన్ సూటిగా చెప్పేసింది. తనకు ఇంకా పెళ్లి కాలేదని, కనీసం ఎంగేజ్‌మెంట్ కూడా కాలేదని వెల్లడించింది. తాను ప్రస్తుతం చాలా ఆనందంగా ఉన్నానని ఆమె వెల్లడించింది. ఈ వ్యవహారంగానే తాను పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చినట్లుగానే భావిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. తన సంతోషంలో పాలుపంచుకుంటున్న అభిమానులకు ధన్యవాదాలు అంటూ చెప్పింది. తామిద్దరం డేటింగ్‌లో ఉన్నట్లు లలిత్ మోదీ వెల్లడించిన విషయం తెలిసిందే. పెళ్లి, ఎంగేజ్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన సుస్మితాసేన్.. డేటింగ్‌పై మాత్రం నోరు విప్పలేదు.
Also Read
- Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
- Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
- Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
- Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
ఇటీవల లలిత్ మోదీ, సుస్మితా సేన్ కుటుంబాలు కలిసి.. మాల్దీవులకు వెళ్లాయి. మాల్దీవుల్లో కుటుంబాలతో కలిసి సరదాగా గడిపారు. మాల్దీవుల పర్యటన ముగించుకుని ఇప్పుడే లండన్ చేరుకున్నామని, తన బెటర్ లుకింగ్ పార్ట్‌నర్ సుష్మితా సేన్‌తో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాననంటూ లలిత్ మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ట్విటర్ వేదికగా కూడా తెలపడంతో కాసేపట్లోనే ట్వీట్ వైరల్ అయింది. లలిత్ తన ఇన్‌స్టాగ్రామ్ డిస్‌ప్లే చిత్రాన్ని కూడా సుస్మితతో కలిసి ఉన్న ఫొటోను పెట్టాడు. ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ బయోని కూడా మార్చాడు. “చివరకు నా భాగస్వామితో కొత్త జీవితాన్ని ప్రారంభించాను. నా ప్రేమ @sushmitasen47” అని వ్రాశాడు.
లలిత్ గతంలో మినల్ సగ్రానీని వివాహం చేసుకున్నాడు. ఆమెను ఆయన అక్టోబర్ 1991లో వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు రుచిర్, కుమార్తె అలియా. అతను మినాల్ మొదటి వివాహం నుండి కరీమా సగ్రానీకి సవతి తండ్రి కూడా. దురదృష్టవశాత్తు, మినాల్ 2018లో క్యాన్సర్‌తో మరణించింది. మరోవైపు, సుస్మిత 2018లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన మోడల్ రోహ్‌మన్ షాల్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది, అయితే గత సంవత్సరం అతనితో విడిపోయింది. ఆమె రెనీ, అలీసా అనే ఇద్దరు దత్తపుత్రికలకు తల్లి.
తాజావార్తలు
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!