Sushanth-Priya Anand starrer Maa Neella Tank clocks 50 million streaming minutes: సుశాంత్, ప్రియా ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మా నీళ్ల ట్యాంక్’ వెబ్ సిరీస్‌కి జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. జీ5లో ప్రసారమవుతున్న ఈ సిరీస్.. లేటెస్ట్‌గా 50 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్‌ని దాటేసింది. జులై 15వ తేదీ నుంచి జీ5 ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమవుతున్న ఈ ఎనిమిది ఎపిసోడ్ల సిరీస్‌కి అంత ప్రోత్సాహకరమైన రివ్యూలైతే రాలేదు కానీ, ప్రేక్షకుల ప్రేమను మాత్రం చూరగొంటోంది. మరో విశేషం ఏమిటంటే.. ఇది జీ5 ఇండియాలో టాప్-3 లో ట్రెండ్ అవుతోంది. దీన్ని బట్టి ఈ సిరీస్ ఎంతలా ఆకట్టుకుంటోందో అర్థం చేసుకోవచ్చు.
రివ్యూలు యావరేజ్‌గా వచ్చినా, ఈ స్థాయిలో ఆదరణ పొందడానికి కారణం.. ఈ సిరీస్ ఎంటర్టైనింగ్‌గా సాగడమే! ప్లాట్ గాడి తప్పకుండా సాగే ఈ విలేజ్ డ్రామా సిరీస్‌లో ప్రేక్షకుల్ని నవ్వించే కామెడీ ఎలిమెంట్స్, బోర్ కొట్టకుండా సరదాగా గడిచిపోయేందుకు కావాల్సిన ఇతర ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అందుకే, ఒక్క ఎపిసోడ్ కూడా వదలకుండా ఆడియన్స్ ఈ సిరీస్‌ని వీక్షిస్తున్నారు. మధ్యలోనే వదిలేసిన వాళ్లు, తిరిగి అక్కడినుంచే చూస్తున్నారు. ఎవరైతే సరదాగా కాలక్షేపం చూస్తూ, మంచి అనుభూతి పొందాలనుకుంటున్నారో.. లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో రూపొందిన ‘మా నీళ్ల ట్యాంక్’ వెబ్ సిరీస్‌ని తప్పకుండా చూడాల్సిందే! ఇది కచ్ఛితంగా నిరాశపరచదు. కాగా.. ఇందులో బిగ్‌బాస్ బ్యూటీ దివి వాడ్త్యా ఓ కీలక పాత్రలో నటించింది.
