Site icon NTV Telugu

Retro : రెట్రో కలెక్షన్లు.. సూర్య కెరీర్ లోనే హయ్యెస్ట్..

Retro

Retro

Retro : తమిళ స్టార్ హీరో సూర్య నటంచిన రెట్రో మూవీ భారీ హిట్ అందుకుంది. తెలుగులో మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. కోలీవుడ్ లో మాత్రం మంచి టాక్ తెచ్చుకుంది. తమిళంలో మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. తాజాగా మూవీ క్లోజింగ్ కలెక్షన్లను మేకర్స రిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.235 కోట్లు కలెక్ట్ చేసిందని అధికారికంగా ప్రకటించారు. సూర్య కెరీర్ లోనే ఈ మూవీ అత్యధిక కలెక్షన్లు సాధించిందని తెలిపారు. ఇదంతా సూర్య అభిమానులు చూపించిన ప్రేమ వల్లే సాధ్యం అయిందన్నారు. సూర్య నటించిన గత మూవీ కంగువా భారీ అంచనాలతో వచ్చి అట్టర్ ప్లాప్ అయింది. ఆ ప్లాప్ మూడ్ నుంచి ఈ మూవీ బయట పడేసిందని అంటున్నారు అభిమానులు.

Read Also : Tax Saving Schemes: టాప్ 5 ట్యాక్స్ సేవింగ్ స్కీమ్‌లు.. రూ. 1.5 లక్షలు ఆదా చేసుకోవచ్చు!

సూర్య నటించిన చాలా సినిమాల కంటే రెట్రో ఎలాంటి అంచనాలు లేకుండానే రిలీజ్ అయింది. మూవీ టీక్ తమిళంలో బాగుండటంతో అక్కడ మంచి కలెక్షన్లు వచ్చాయి. ఒకవేళ ముందు నుంచే భారీ హైప్ ఇచ్చి ఉంటే కంగువా పరిస్థితి వస్తుందేమో అని మూవీ టీమ్ కామ్ గా రిలీజ్ చేసింది. ఈ మూవీ తర్వాత సూర్య నటించిన 24 మూవీ ఉంది. అది రూ.157 కోట్లు కలెక్ట్ చేసింది. సింగం2 రూ. 122 కోట్లు, కంగువా రూ.106 కోట్లు వసూలు చేశాయి. ఇలా రెట్రో మూవీ అన్నింటికంటే భారీగా కలెక్ట్ చేసింది. ఈ జోష్ తో సూర్య కార్తీక్ సుబ్బరాజుతో మరో మూవీ చేస్తానని హామీ ఇచ్చాడంట. ఈ మూవీలో సూర్య సరసన పూజాహెగ్డే నటించింది.

Read Also : Naveen Polishetty : సంచలన దర్శకుడితో నవీన్ పోలిశెట్టి మూవీ..?

Exit mobile version