Site icon NTV Telugu

‘జై భీమ్’ అంటున్న సూర్య!

ప్రముఖ తమిళ నటుడు సూర్య 39వ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ అతని పుట్టిన రోజు సందర్భంగా వెలువడింది. సొంత బ్యానర్ 2 డి ఎంటర్ టైన్ మెంట్ లో టి. జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య నిర్మిస్తున్న చిత్రానికి ‘జై భీమ్’ అనే పేరును ఖరారు చేశారు. రాజీషా విజయన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో సూర్య న్యాయవాదిగా కనిపిస్తుండటం విశేషం. సమాజంలో అట్టడుగు వర్గానికి చెందిన గిరిజనుల హక్కులకై న్యాయపోరాటం చేసే వకీల్ గెటప్ లో ఉన్న సూర్య పోస్టర్ ను అతని బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. ‘నవరస’ ఆంధాలజీతో పాటు సూర్య ప్రముఖ దర్శకుడు వెట్రి మారన్ తో ‘వాడి వాసల్’ మూవీని, పాండిరాజ్ దర్శకత్వంలో ‘ఎదర్కుం తనిందవన్’ చిత్రాన్ని చేస్తున్నాడు. మొత్తంగా చూస్తే సూర్య చేస్తున్న మూడు ఫీచర్స్ ఫిల్మ్స్ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా కథల రీత్యా ఆసక్తిని కలిగిస్తున్నాయి.

Exit mobile version