కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం కరుప్పు. తెలుగులో ‘వీరభద్రుడు’పేరుతో రిలీజ్ అయినా ఈ సినిమా ట్రేడ్ వర్గాలను ఆశ్ఛర్యపరిచింది. అసలు విడుదలకు ముందు ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లోగానీ ప్రేక్షకుల్లోగానీ ఎలాంటి అంచనాలు లేవు. రిలీజ్ రోజు అడ్డంకులు ఎదురై పోస్ట్ పోన్ అయిన కరుప్పు థియేటర్లలోకి వచ్చిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. తొలి రోజు డీసెంట్ ఓపెనింగ్ తెచ్చుకుంది సూర్య గత సినిమాల కంటే బాగుందనే టాక్ తెచ్చుకుంది. ఆ మౌత్ టాక్ ఊహించని విధంగా వసూళ్లు తెచ్చిపెట్టి తెలుగు రాష్ట్రాల్లో అనూహ్య విజయాన్ని నమోదు చేస్తోంది.
అటు వరల్డ్ వైడ్ గా మూడు రోజుల ఓపెనింగ్ వీకెండ్‌లోనే ఈ చిత్రం డబుల్ డిజిట్ గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్‌ను ఆశ్చర్యపరిచింది. థియేటర్ల వద్ద నీరసించిన ఎగ్జిబిటర్లకు ఈ కలెక్షన్లు పెద్ద ఊరటనిచ్చాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘వీరభద్రుడు’ మూడు రోజుల కలెక్షన్లు చూస్తే డే 1 రూ. 15.93 కోట్లు, డే 2 : రూ. 23.26 కోట్లు, డే 3 రూ. 29.01 కోట్లు రాబట్టి దూసుకెళ్తోంది. అటు ఓవర్సీస్ లో 3మిలియన్ దాటి వెళ్తోంది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే రూ. 150 కోట్ల గ్రాస్ మార్క్ కు దగ్గరగా వసూళ్లు రాబట్టింది. సినిమాకు సడన్‌గా ఇలాంటి భారీ వసూళ్లు రావడానికి కారణం ప్రేక్షకుల్లో సూర్యపై ఉన్న గుడ్‌విల్ అని చెప్పవచ్చు. కథలో విషయం ఉండటం దానికి తోడు సూర్య క్రేజ్ తోడవడంతో బాక్సాఫీస్ వద్ద అన్నీ అనుకూలంగా మారిపోయాయి. సూర్య వన్ మ్యాన్ షోగా సాగిన ఈ యాక్షన్ డ్రామా ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయింది. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. సూర్య కెరీర్‌లో 2013లో వచ్చిన ‘సింగమ్ 2’ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. ఆ తర్వాత నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆ రేంజ్ మ్యాజిక్ చేయలేకపోయాయి. అయితే ఇప్పుడు ‘వీరభద్రుడు’ (‘కరుప్పు’) చిత్రంతో ఆ రికార్డులను సూర్య బ్రేక్ చేశారు. ‘సింగమ్ 2’ బాక్సాఫీస్ నెంబర్లను దాటడానికి సూర్యకు ఏకంగా 13 ఏళ్ల సమయం పట్టడం విశేషం. ఏదేమైనా చాలా కాలం తర్వాత సూర్య తన పవర్‌ఫుల్ కంబ్యాక్‌తో అటు తమిళ్ లోను ఇటు తెలుగు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు.
