కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య తాజా చిత్రం “ఎతర్క్కుం తునింధవన్”తో మళ్లీ ప్రేక్షకులను అలరించబోతున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నటుడు సూర్యకు ప్రేమగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మార్చి 10న ఈ చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించారు. “ఈటీ” పేరుతో ప్రేక్షకులను అలరించనున్న ఈ సినిమా టీజర్ కు ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్.
Read also : Deep Sidhu : యాక్సిడెంట్… రైతు నిరసనతో వార్తల్లో నిలిచిన నటుడి మృతి
“ఈటీ” మూవీ టీజర్‌ను ఫిబ్రవరి 18న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఒక అద్భుతమైన టీజర్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. కరోనా సమయంలో ఓటిటి ద్వారా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సూర్య ఈసారి మాత్రం థియేటర్లలోకి పాన్ ఇండియా లెవెల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత సూర్య నుంచి వస్తున్న సినిమా కావడంతో “ఎతర్క్కుం తునింధవన్”పై అంచనాలు భారీగా ఉన్నాయి.