Site icon NTV Telugu

Suriya 42: బాహుబలి రేంజులో సూర్య సినిమా… టైటిల్ ‘కంగువ’

Suriya 42

Suriya 42

తెలుగు, కన్నడ నుంచి పాన్ ఇండియా సినిమాలు వచ్చి నార్త్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి కానీ ఎన్నో సంవత్సరాల క్రితం నుంచే లార్జర్ దెన్ లైఫ్ సినిమాలని చేస్తూ వచ్చిన తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మాత్రం సరైన ప్రాజెక్ట్ రావట్లేదు. ఆ లోటుని భర్తీ చెయ్యడానికి వస్తున్నాడు కోలీవుడ్ సూపర్ స్టార్ ‘సూర్య’. ‘సూర్య 42’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ సిరుత్తే శివ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా రూపొందుతుంది. దాదాపు పది భాషల్లో, 2D అండ్ 3D ఫార్మాట్స్ లో ‘సూర్య 42’ విడుదల కానుంది. బాలీవుడ్ బ్యూటీ దిశా పఠాని హీరోయిన్ గా నటిస్తున్న ‘సూర్య 42’ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని ఏప్రిల్ 16న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

Read Also: Akhil: ఏజెంట్ ట్రైలర్ వస్తోంది… ప్రమోషన్స్ లో ఫైర్ వచ్చింది

రేపు ఉదయం టైటిల్ ని మేకర్స్ రివీల్ చెయ్యనున్నారు. అయితే మేకర్స్ అనౌన్స్ చేసే లోపే ‘కంగువ’ ఈ సినిమా టైటిల్ అంటూ సోషల్ మీడియాలో లీక్ వచ్చేసింది. దీంతో ‘కంగువ’ ‘సూర్య 42’ టాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సూర్య ఫాన్స్ మంచి జోష్ లో ఉన్నారు, ఇదే జోష్ రేపు టైటిల్ తో మరింత పెంచగలిగితే ‘సూర్య 42’ సినిమాకి హ్యూజ్ హైప్ జనరేట్ అవ్వడం గ్యారెంటీ. ప్రస్తుతం సూర్య 42 సినిమాపై ఉన్న హైప్ చూస్తుంటే, ట్రేడ్ వర్గాలకే షాక్ ఇచ్చే రేంజులో బిజినెస్ చేసేలా ఉంది. ఏ మాత్రం కంటెంట్ అండ్ మేకింగ్ లో క్వాలిటి మైంటైన్ చేస్తే చాలు ‘సూర్య 42’ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్యం లేదు.

Exit mobile version