Surender Reddy Injured In Agent Shooting: సాధారణంగా మనకు చిన్న గాయం తగిలితేనే.. పట్టపగలే చుక్కలు కనిపించేస్తాయి. దాన్నుంచి కోలుకోవడానికి కొన్ని గంటల సమయమే పడుతుంది. ఏదైనా పని చేయాలన్నా, పూర్తి దృష్టి సారించలేం. ఆ గాయం బాధిస్తూనే ఉంటుంది. అందుకే, విరామం తప్పకుండా తీసేసుకుంటాం. కానీ.. వృత్తి పట్ల డెడికేషన్ ఉన్న వాళ్లు మాత్రం అలా కాదు. ఎంత పెద్ద దెబ్బ తగిలినా సరే, ఆ బాధను దిగమింగుకుంటూనే ఎంతో డెడికేషన్‌తో తమ పని పూర్తి చేస్తారు. ఇలాంటి పరిణామాలు సినీ పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. జ్వరం వచ్చినా, గాయాలు అయినా, సర్జరీలు జరిగినా సరే.. ఆ బాధతోనే సెట్‌కి హాజరై నటీనటులు తమ పనిని ముగిస్తారు. ఇప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డి సైతం గాయంతోనే సెట్‌లో అడుగుపెట్టాడు.
Minister Roja: నాగబాబుకి స్ట్రాంగ్ కౌంటర్.. అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తుంది?
అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే! ఈ ప్రాజెక్ట్‌ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సురేందర్.. సినిమా షూటింగ్ చకచకా కానిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు షూటింగ్‌లో గాయపడ్డాడు. ఒక యాక్షన్ సీన్‌ను చిత్రీకరించే సమయంలో.. ఎడమ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లి, చికిత్స అందించారు. కాలికి కట్టు కట్టారు. అయితే.. సురేందర్ విశ్రాంతి తీసుకోకుండా, చికిత్స చేయించుకున్న వెంటనే తిరిగి సెట్‌లో అడుగుపెట్టాడు. గాయంతో బాధపడుతూనే.. ఏజెంట్‌లోని కీలక సన్నివేశాలను షూట్ చేశారు. వీల్ చైర్‌లో సెట్‌కి హాజరైన సురేందర్.. ఒక టేబుల్‌పై గాయమైన కాలుకి పెట్టి మరీ సన్నివేశాల్ని షూట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు.. సురేందర్ డెడికేషన్‌ని మెచ్చుకుంటున్నారు.
Krishnamachari Srikkanth: వరల్డ్‌కప్ జట్టులో ఆ ఇద్దరు వద్దు.. బాంబ్ పేల్చిన శ్రీకాంత్
గతంలో బాలీవుడ్ సినిమా లగాన్ షూటింగ్ సమయంలో కూడా దర్శకుడు అశుతోష్ గోవరికర్‌కి పచ్చకామెర్లు వస్తే.. ఆయన బెడ్ మీదే పడుకొని, లగాన్ సీన్లను చిత్రీకరించారు. ఆ సమయంలోనే క్లైమాక్స్ భాగం షూటింగ్ జరుగుతోంది. ఇప్పుడు కాలి గాయంతోనే సురేందర్ ‘ఏజెంట్’ క్లైమాక్స్‌ని షూట్ చేస్తుండటంతో.. ‘లగాన్’ రోజుల్ని గుర్తుకు చేసుకుంటున్నారు. కాగా.. వరుసగా మూడు పరాజయాల తర్వాత ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’తో హిట్ అందుకున్న అఖిల్, ఇప్పుడు ఏజెంట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఇది తెరకెక్కుతోంది. దీనిని పాన్ ఇండియా సినిమాగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
