Site icon NTV Telugu

Virupaksha: మెగా మేనల్లుడు వంద కోట్లు కొట్టాడు కానీ…

Virupaksha

Virupaksha

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ‘విరుపాక్ష’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టేసాడు. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీ అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో కాసుల వర్షం కురిపించింది. బ్రేక్ ఈవెన్ మార్క్ ఫస్ట్ వీక్ లోనే క్రాస్ చేసిన విరుపాక్ష మూవీ వంద కోట్ల క్లబ్ లో చేరింది. థియేట్రికల్ రన్ దాదాపు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వంద కోట్లు రాబట్టింది అంటూ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఏప్రిల్ 28న ఏజెంట్, పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి కాబట్టి వీటి వలన విరుపాక్ష సినిమా కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తుందేమో అని ట్రేడ్ వర్గాలు లెక్కేసాయి కానీ ఏజెంట్ సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో విరుపాక్ష సినిమాకి మరింత లాంగ్ రన్ దొరికింది. ముందు తెలుగులో మాత్రమే రిలీజ్ అయ్యి ఆ తర్వాత హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ అయ్యింది విరూపాక్ష సినిమా.

తెలుగు రాష్ట్రాల్లో హిట్ టాక్ రావడంతో విరూపాక్ష సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేసాయి కానీ విరూపాక్ష సినిమా తెలుగు రాష్ట్రాల మినహా మిగిలిన ప్రాంతాల్లో ఇంపాక్ట్ చూపించలేకపోయింది. విరుపాక్ష వంద కోట్లు రాబడితే అందులో ఈజీ ఒక 95 కోట్లు తెలుగు వెర్షన్ నుంచే వచ్చి ఉంటాయి అంటే ఇతర భాషల్లో విరూపాక్ష ఎంత రాబట్టిందో అర్ధం చేసుకోవచ్చు. స్పైన్ చిల్లింగ్ బ్లాక్ బస్టర్ గా పేరు తెచ్చుకున్న విరుపాక్ష మూవీ అనౌన్స్మెంట్ సమయంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రొజెక్ట్ అయ్యింది. రిలీజ్ సమయంలో తెలుగుకి మాత్రమే స్టిక్ అయ్యారు కానీ అన్ని భాషల్లో ఒకటే సారి రిలీజ్ చేసి ఉంటె విరూపాక్ష సినిమాకి ఇతర భాషల్లో మంచి కలెక్షన్స్ వచ్చేవేమో. ఏదేమైనా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మాత్రం కెరీర్ బెస్ట్ హిట్ కొట్టడమే కాకుండా విరూపాక్ష సినిమాతో వంద కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయాడు.

Exit mobile version