సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుండి ఈ ఇద్దరు స్టార్స్ నువ్వా నేనా అని పోటీపడిన సూపర్ స్టార్ రజనీ, కమల్ హాసన్ ఇప్పుడు చేతులు కలిపారు. ఈ ఇద్దరూ కలిపి ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నారు. కానీ హీరోలుగా కాదులెండి. సూపర్ స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రం తలైవర్173 సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో కమల్ హాసన్ నిర్మాతగా చేయబోతున్నాడు. ఈ సినిమాకు కోలివుడ్ సీనియర్ దర్శకుడు సుందర్ దర్శకత్వం వహించబోతున్నాడు.
దర్శకుడు సుందర్ సి గతంలో రజనీకాంత్ తో అరుణాచలం (1997) అనే బ్లాక్ బస్టర్ సినిమా చేసాడు. అటు కమల్ హాసన్ తో అన్బే శివంకు దర్శకత్వం వహించారు. అన్బే శివం కమర్షియల్ సక్సెస్ కాకున్నా ఇప్పటికి కమల్ కెరీర్ లో ఇప్పుడు అదొక కల్ట్ క్లాసిక్. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఓ సినిమా చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. రజనీకాంత్ హీరోగా సుందర్ సి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ కేవలం నిర్మాతగానే ఉంటాడా లేక క్యామియోలో కనిపిస్తాడా అనేది చూడాలి. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ సినిమాను 2027 పొంగల్ సందర్భంగా థియేటర్లలో విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. రజనీకాంత్ ప్రస్తుతం నటిస్తున్న జైలర్ 2 షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆ సినిమా ఫినిష్ అయిన వెంటనే సుందర్ సి సినిమా సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు రజనీకాంత్. ఈ సినిమాకు సంబంధించి పూర్తి తారాగణం మరియు సిబ్బంది వివరాలను త్వరలో ప్రకటిస్తారు.
காற்றாய் மழையாய் நதியாய்
பொழிவோம் மகிழ்வோம் வாழ்வோம்!ராஜ்கமல் பிலிம்ஸ் இண்டர்நேசனல் தயாரிப்பில் சுந்தர்.சி இயக்கத்தில் இனிய நண்பர் சூப்பர் ஸ்டார் ரஜினிகாந்த் நடிக்கும் #Thalaivar173 #Pongal2027 @rajinikanth#SundarC#Mahendran@RKFI @turmericmediaTM pic.twitter.com/wBT5OAG4Au
— Kamal Haasan (@ikamalhaasan) November 5, 2025
