Super Subbu: బోల్డ్ సబ్జెక్టే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు.. ‘సూపర్ సుబ్బు’పై సందీప్ కిషన్ హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Super Subbu: ఓటీటీలో కొత్త కథలు, విభిన్నమైన కాన్సెప్ట్‌లకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరణ చూపిస్తున్న సమయంలో, నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ ఆసక్తిని కలిగిస్తోంది. టైటిల్ నుంచి కథ వరకు అన్నింటిలోనూ ప్రత్యేకతను చూపిస్తున్న ఈ సిరీస్, విడుదలకు ముందే మంచి బజ్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సెక్స్ ఎడ్యుకేషన్ వంటి సున్నితమైన అంశాన్ని ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో హీరో సందీప్ కిషన్ నేను హామీ ఇస్తున్నా అంటూ వివరణ ఇచ్చారు.
సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సూపర్ సుబ్బు’కు ‘టిల్లు స్క్వేర్’ దర్శకుడు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్‌గా రూపొందిన ఈ ప్రాజెక్ట్ జూలై 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ప్రమోషనల్ కంటెంట్ ఈ సిరీస్‌పై మంచి అంచనాలను పెంచాయి. ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన సందీప్ కిషన్, ఈ సిరీస్ సెక్స్ ఎడ్యుకేషన్ చుట్టూ తిరిగే కథ అయినప్పటికీ ఎక్కడా అసభ్యతకు తావు ఉండదని స్పష్టం చేశారు. ఇబ్బందికరమైన సన్నివేశాలు, అసభ్య పదజాలం లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి చూడగలిగేలా ఈ కథను తెరకెక్కించినట్లు చెప్పారు. షూటింగ్ సమయంలో ఎక్కడా హద్దులు దాటకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించామని, అందుకు దర్శకుడు మల్లిక్ రామ్‌కు పూర్తి క్రెడిట్ ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.
Also Read
ఈ కథ మొదట తన వద్దకు వచ్చినప్పుడు తాను కూడా ఆశ్చర్యపోయానని సందీప్ వెల్లడించారు. అయితే కథను పూర్తిగా విన్న తర్వాత ఇది కేవలం సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పే సిరీస్ కాదని, జీవితంలో ఎదురయ్యే ఊహించని పరిస్థితుల ద్వారా ఒక వ్యక్తి తనను తాను ఎలా తెలుసుకుంటాడనే అంశాన్ని ప్రధానంగా చూపిస్తుందని చెప్పారు. ఈ సిరీస్ ఎవరికి ఎలా జీవించాలో నేర్పే ప్రయత్నం చేయదని, కానీ జీవితంలో పాటించాల్సిన బాధ్యతలు, జాగ్రత్తలను వినోదాత్మకంగా గుర్తు చేస్తుందని వివరించారు. ప్రస్తుతం ఓటీటీ వేదికలపై బోల్డ్ కంటెంట్ ఎక్కువగా వస్తోందనే విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో, సున్నితమైన అంశాన్ని హద్దులు దాటకుండా వినోదాత్మకంగా చెప్పేందుకు ‘సూపర్ సుబ్బు’ ప్రయత్నించడం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి అంతా జూలై 3పైనే ఉంది. నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్‌గా ‘సూపర్ సుబ్బు’ ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి మరి.
- Tags
- cinema
తాజావార్తలు
-
Kanaka Durgamma Temple: సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి!
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్‌కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్‌మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగుండదు, లాభాలే లాభాలు!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!