తెలుగులో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా మంచి మూవీ రాగానే ఇంటికి పిలిచి మరీ అభినందించే హీరో చిరంజీవి మాత్రమే. తమిళ్ లో ఇలా ఎవరు మంచి సినిమా చేసిన అభినందించే హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఏ దర్శకుడు, ఏ హీరో మంచి సినిమా చేసినా స్వయంగా వారిని కలిసి కాంప్లిమెంట్స్ ఇవ్వడం రజినీ రెగ్యులర్ గా చేసే పని. సూపర్ స్టార్ నుంచి ఇలాంటి అప్రిసియేషణ్ అందుకున్న లేటెస్ట్ సినిమా ‘విడుదలై పార్ట్ 1’. ఫ్లాప్ అనేదే తెలియని దర్శకుడు వెట్రిమారన్, యాక్టర్ సూరిని హీరోగా పెట్టి చేసిన ఈ సినిమా కోలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది. విజయ్ సేతుపతి స్పెషల్ రోల్ ప్లే చేసిన విడుదలై పార్ట్ 1 సినిమా సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయినా కలెక్షన్స్ లో మాత్రం డ్రాప్ కనిపించట్లేదు. ఇప్పటివరకూ ముప్పై కోట్లు రాబట్టిన ఈ సినిమా వెట్రిమారన్ బెస్ట్ వర్క్ టిల్ డేట్ గా పేరు తెచ్చుకావడంతో ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. జైలర్ షూటింగ్ గ్యాప్ లో రజినీకాంత్ కూడా విడుదలై పార్ట్ 1 సినిమాని స్పెషల్ ప్రిమియర్ వేసుకోని చూశాడు.
వెట్రిమారన్, సూరి ఇతర చిత్ర యూనిట్ తో కలిసి సినిమా చూసిన రజినీకాంత్… వెట్రిమారన్ మేకింగ్ ని ప్రత్యేకంగా అభినంది, విడుదలై పార్ట్ 1 సినిమా తెలుగులో కూడా మంచి హిట్ కావాలని కోరుకున్నాడు. ఈ ప్రిమియర్ అయిపోగానే రజినీకాంత్, వెట్రిమారన్, సూరి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యాయి. వీటిని చూడగనే రజినీ, వెట్రిమారన్ కాంబినేషన్ లో ఒక్క సినిమా బాగుంటుందని కోలీవుడ్ సినీ అభిమానులు కోరుకుంటున్నారు. స్టొరీ టెల్లింగ్ మాస్టర్ అయిన వెట్రిమారన్, హీరో అనే పదానికే స్వాగ్ ని నేర్పించిన రజినీకాంత్ కలిసి ఒక సినిమా చేస్తే కోలీవుడ్ మాత్రమే కాదు ఎంటైర్ ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారెంటీ. ఇదిలా ఉంటే ఏప్రిల్ 15న విడుదలై పార్ట్ 1 సినిమా విడుదల పార్ట్ 1గా తెలుగులో రిలీజ్ కానుంది. గీత ఆర్ట్స్ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చెయ్యనుంది. మరి కోలీవుడ్ లో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి రిజల్ట్ ని రాబడుతుందో చూడాలి.
Superstar @rajinikanth watched #VidudhalaPart1 and lauded the team #Vetrimaaran @sooriofficial @rsinfotainment pic.twitter.com/2f4QHu7MtR
— Rajasekar (@sekartweets) April 8, 2023