సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూడో సినిమా, వచ్చే జనవరికి టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది అనే అంచనాలని అనౌన్స్మెంట్ తోనే సెట్ చేసిన సినిమా ‘గుంటూరు కారం’. మెసేజులు లేకుండా కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా చాలా రోజుల తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమాపై హ్యూజ్ హైప్ ఉంది. ఫస్ట్ లుక్ కే రచ్చ లేపిన త్రివిక్రమ్ అండ్ టీమ్… మే 31న వదిలిన మాస్ స్ట్రైక్ వీడియోతో సెన్సేషన్ క్రియేట్ చేసారు. మహేష్ బీడీ తాగుతూ వింటేజ్ వైబ్స్ ఇచ్చి ఫాన్స్ కి సూపర్ కిక్ ఇచ్చాడు. గత పదేళ్లలో మహేష్ ని ఇంత మాస్ గా చూడకపోవడంతో ఫాన్స్ లో జోష్ మాములుగా లేదు. మాస్ స్ట్రైక్ వీడియో బాక్సాఫీస్ దగ్గర గుంటూరు కారం ఘాటు ఏ రేంజులో ఉంటుందో జస్ట్ సాంపిల్ చూపించింది.
ఇక టీజర్, ట్రైలర్ కూడా బయటకి వస్తే గుంటూరు కారం సినిమాపై అంచనాలు, ట్రేడ్ వర్గాల లెక్కలు మరింత పెరిగడం గ్యారెంటీ. అయితే ప్రస్తుతం గుంటూరు కారం షెడ్యూల్ బ్రేక్ లో ఉంది. నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో స్టార్ట్ అవుతుంది, అదిగో స్టార్ట్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో ఏవేవో కామెంట్స్ వినిపిస్తున్నాయి. జులై ఫస్ట్ వీక్ లో గుంటూరు కారం కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అనే మాట కూడా వినిపించడం మొదలయ్యింది. ఈ ప్రాజెక్ట్ డిలే అవుతూనే ఉంది అంటూ విమర్శలు కూడా చేస్తున్నారు. నిజానికి సినీ అభిమానులు, సోషల్ మీడియాలో ట్వీట్స్ చేసే వాళ్లు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. రిలీజ్ కి ఇంకా ఆరు నెలల సమయం ఉంది కాబట్టి అప్పటి లోపు గుంటూరు కారం షూటింగ్ కంప్లీట్ అవుతుంది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయిపోతాయి.