Super Singer to Launch on December 23rd in Star MAA: సింగింగ్ షో లలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని, ఎన్నో అద్భుత స్వరాలు పరిచయం చేసిన “సూపర్ సింగర్” ఇప్పుడు స్టార్ మా లో మరింత వినూత్నంగా మళ్ళీ ప్రారంభం కాబోతోందని ప్రకటించారు నిర్వాహకులు. విభిన్నమైన ఆలోచనతో, విలక్షణమైన వాయిస్ లతో లాంచింగ్ ఎపిసోడ్ కోసం సర్వం సిద్ధం చేసుకుంది. షో కోసం ఆడిషన్స్ నిర్వహించి,.. వాటి నుంచి వడపోసిన స్వరాలు ప్రేక్షకులు ఆస్వాదించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక అమెరికా నుంచి, కేరళ నుంచి వచ్చి పాటల మీద, సంగీతం మీద ఆసక్తితో, నిరూపించుకోవాలని ఆకాంక్షతో కంటెస్టెంట్స్ పాల్గొనేందుకు రావడం ఈ షో ప్రత్యేకత. శ్రీముఖి ఈ షో కి హోస్ట్ చేస్తుండగా నలుగురు విభిన్నమైన ప్రతిభ గల న్యాయమూర్తులు ఈ సారి కంటెస్టెంట్స్ ని తీర్చిదిద్దడమే కాదు.. వారి పాటల పాటవాన్ని నిర్ణయించబోతున్నారు. పోటీని మరింత రసవత్తరంగా నడిపించబోతున్నారు.
Sivaji: ప్రశాంత్ గురించి పదేపదే ప్రతీసారి మాట్లాడాలా ఏంటి? అరెస్ట్‌పై శివాజీ స్పందన
కమ్మని బాణీకి తన తియ్యని స్వరాన్ని చేర్చి పాటని అందమైన అనుభవంగా తీర్చిదిద్దే గాయని శ్వేతా మోహన్, జానపదాన్ని, సినిమా గీతాన్ని సమానంగా తన విలక్షణమైన గొంతుతో పలికిస్తున్న మంగ్లీ, అకాడమీ అవార్డుల వేదిక పైన తన బలమైన వినూత్న స్వరాన్ని వినిపించిన యువ స్వరం రాహుల్ సిప్లిగంజ్, అందమైన సాహిత్య స్పర్శ తో సందర్భానికి సముచితమైన, ఘనమైన స్థానాన్ని ఇచ్చే గేయ రచయిత అనంత శ్రీరామ్ లు ఈ సారి న్యాయ నిర్ణేతలు. 20 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభం కాబోతున్న ఈ షో లో 16 మందితో అసలైన పోటీ మొదలవుతుంది. ఈ నెల 23 నుంచి.. ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు “సూపర్ సింగర్” సంగీతాభిమానుల్నే కాదు.. “స్టార్ మా” ప్రేక్షకుల్ని అలరించబోతోంది. షో నిర్వహణలో ఈ సారి స్టార్ మా ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. కంటెస్టెంట్స్, వాళ్ళని తీర్చిదిద్దే జడ్జెస్, మార్కులు.. ఇవి మాత్రమే కాకుండా షో ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా మలచబోతున్న ఆ విషయం ఏంటో తెలుసుకోవాలంటే స్టార్ మా లో సూపర్ సింగర్ చూడాల్సిందే.