Site icon NTV Telugu

Prithiviraj: ఆ స్టార్ హీరో స్థానంలో అక్షయ్ కుమార్..?

Sunny Deol First Choice For Prithviraj

Sunny Deol First Choice For Prithviraj

బాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ బ్యాంకబుల్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకడు. ఇతని సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చినా సరే, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది. పైగా, అతి తక్కువ సమయంలోనే షూటింగ్ కంప్లీట్ చేస్తాడు. ఏకకాలంలోనే రెండు, మూడు సినిమాల చిత్రీకరణల్లో పాల్గొంటాడు. ఇతనికున్న ఈ కమిట్మెంట్ & బాక్సాఫీస్ ట్రాక్ రికార్డ్ చూసే.. దర్శకనిర్మాతలు అక్షయ్‌తో సినిమాలు చేసేందుకు క్యూ కడుతుంటారు. చివరికి.. ఇతర హీరోలకు వెళ్ళాల్సిన ప్రాజెక్టులు కూడా ఇతనికి చేరుతాయి. అలాంటి వాటిల్లో పృథ్వీరాజ్ ఒకటి.

తొలుత ఈ సినిమాను సన్నీ డియోల్‌తో చేయాలని మేకర్స్ భావించారు. పృథ్వీరాజ్ లాంటి వారియర్ కింగ్ పాత్రకు, సన్నీ అయితేనే పర్ఫెక్ట్‌గా సూటవుతాడని, అతనితోనే ఈ చిత్రం చేయాలని దాదాపు ఫిక్సయ్యారు. దర్శకుడు చంద్రప్రకాశ్ ద్వివేది ఆ హీరోతో చర్చలు జరిపాడు కూడా! అయితే, ఇంతలో నిర్మాత ఆదిత్య చోప్రా జోక్యం చేసుకొని, బ్యాంకబుల్ స్టార్ అయిన అక్షయ్ కుమార్‌ని తీసుకోవాలని సూచించాడట! సన్నీ డియోల్ ఫేడవుట్ అయిన సంగతి తెలిసిందే! కంబ్యాక్ ఇవ్వాలని ఆ హీరో చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడంతో, ఆయనతో సినిమాలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఆదిత్య చోప్రా కూడా మార్కెట్ పరంగా ఆలోచించి.. సన్నీ డియోల్ స్థానంలో అక్షయ్‌ని దింపాలని చెప్పాడు. దీంతో, అక్షయ్‌తోనే ఈ సినిమా చేయడం జరిగింది.

అయితే.. ట్రైలర్ విడుదలైన తర్వాత అక్షయ్ ఏమాత్రం పృథ్వీరాజ్ పాత్రలో సూటవ్వలేదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇది చూడ్డానికి కింగ్‌కి తక్కువ, కమెడియన్‌కి ఎక్కువ కనిపిస్తున్నాడని సెటైర్లు వేస్తున్నారు. ‘హౌస్‌ఫుల్ 4’ అక్షయ్ పోషించిన ‘బాలా’లాగే ఇందులో కామెడీగా కనిపిస్తున్నాడంటూ.. అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. ట్రైలర్‌కే పరిస్థితి ఇలా ఉందంటే, సినిమా కాస్త తేడా కొడితే ఏమౌతుందో ఏమో?

Exit mobile version