Super Subbu: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ లేపుతోన్న ‘సూపర్ సుబ్బు’.. హిందీ ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన సెక్స్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Super Subbu: ఒకప్పుడు హిందీ వెబ్ సిరీస్‌లే దేశవ్యాప్తంగా ఓటీటీ ప్రపంచాన్ని ఏలేవి. హిందీలో సూపర్ హిట్ అయిన కథలు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డబ్బింగ్ అయి కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకునేవి. కానీ ఇప్పుడు ఆ దిశలో ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. దక్షిణాది నుంచి వచ్చిన ఒక వెబ్ సిరీస్ హిందీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటూ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. అదే నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో, మిథిలా పాల్కర్ కథానాయికగా నటించిన సూపర్ సుబ్బు ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో విశేష ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు భారీ స్పందన రావడం ఈ సిరీస్ ప్రత్యేకతగా మారింది. దక్షిణాది వెబ్ సిరీస్ ఒకటి హిందీ ప్రేక్షకుల్లో ఈ స్థాయి ఆదరణ పొందడం అరుదైన విషయంగా సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతూ భారీ వ్యూయర్షిప్ను నమోదు చేస్తోంది.
ఈ సిరీస్ కథ సెక్స్ ఎడ్యుకేషన్ అనే సున్నితమైన అంశం చుట్టూ తిరుగుతుంది. అయితే దాన్ని బోల్డ్ కంటెంట్ లా కాకుండా, ఒక గ్రామీణ నేపథ్యంలోని సరదా సంఘటనలతో అందరికీ చేరువయ్యేలా తీర్చిదిద్దారు. నవ్వులు పంచుతూనే ఆలోచింపజేసే విధంగా కథను ముందుకు నడిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కుటుంబ సభ్యులతో కలిసి చూడగలిగేలా దర్శకుడు తెరకెక్కించాడని ప్రేక్షకులు కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించిన మల్లిక్ రామ్ గతంలో టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రంతో తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఆదేస్థాయి కామెడితో పాటు ఆకట్టుకునే ఎమోషన్ కూడా ఉండటంతో సిరీస్ కి మంచి ఆదరణ వస్తోంది. చిలక ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సిరీస్ విడుదలైన కొద్ది రోజుల్లోనే మంచి మౌత్ పబ్లిసిటీని సొంతం చేసుకుంది. హిందీ ప్రేక్షకుల నుంచి కూడా సానుకూల సమీక్షలు రావడం దీని విజయానికి మరింత ఊతమిచ్చింది. సందీప్ కిషన్‌కు ఇది ఓటీటీలో తొలి వెబ్ సిరీస్ కావడం, లిటిల్ థింగ్స్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మిథిలా పాల్కర్ కీలక పాత్రల్లో కనిపించడం హిందీ ప్రేక్షకులను మరింత ఆకర్షించింది.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ఇప్పటివరకు హిందీ కంటెంట్ దక్షిణాది భాషల్లో విజయవంతంగా ప్రయాణించినట్లే, ఇప్పుడు దక్షిణాది కథలు కూడా ఉత్తర భారత ప్రేక్షకుల మనసులను గెలుచుకోగలవని సూపర్ సుబ్బు నిరూపిస్తోంది. మంచి కథకు భాష అడ్డంకి కాదని, వినోదంతో పాటు సామాజిక బాధ్యతను మిళితం చేసిన కంటెంట్‌కు దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తుందని ఈ వెబ్ సిరీస్ మరోసారి స్పష్టం చేసింది.
- Tags
- cinema
- Super Subbu
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!