Site icon NTV Telugu

Sundeep Kishan: 2000 మందికి ఇస్తాను మూడు నెలల పాటు ఫ్రీగా చూసుకోండి…

Sundeep Kishan

Sundeep Kishan

తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేస్తున్నాడు కానీ సందీప్ కిషన్ కి హిట్ మాత్రం అందని ద్రాక్షాగానే ఉంది. టాలెంట్ ఉండి, మంచి కాంటాక్ట్స్ ఉండి లక్ మాత్రమే లేని హీరోగా సందీప్ కిషన్ కెరీర్ సాగిస్తున్నాడు. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా సినిమాలకి దూరంగా ఉండకుండా, డిజప్పాయింట్ అవ్వకుండా తిరిగి కెరీర్ ని హిట్ ట్రాక్ ఎక్కించాలి అనే కసితో ఉన్న సందీప్ కిషన్ ‘బ్లడ్ అండ్ స్వెట్’ని పెట్టి ‘మైఖేల్’ సినిమా చేశాడు. విమర్శలు చేసే వాళ్లు కూడా ఆశ్చర్యపోయే రేంజులో సందీప్ కిషన్ మేకోవార్ అయ్యి ‘మైఖేల్’ సినిమాలో నటించాడు.

ఈ పాన్ ఇండియా మూవీ బయటకి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ నే తెచ్చుకుంది. దాంతో సందీప్ కిషన్ హిట్ కొడతాడు అనే అందరిలోనూ కలిగింది. అయితే ఫిబ్రవరి 3న మార్నింగ్ షో పడగానే మైఖేల్ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. కొందరు బాగుంది అంటే మరికొంతమంది బాగోలేదు అంటూ తేల్చి చెప్పారు. బాగోలేదు అనే టాక్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడంతో మైఖేల్ మూవీ సందీప్ కిషన్ ఫ్లాప్ లిస్టులో చేరింది. రిలీజ్ అయిన మూడు వారాల్లోనే మైఖేల్ సినిమా ఒటీటీలోకి వస్తుంది అంటే దీని రిజల్ట్ ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరి 24న ఆహాలో మైఖేల్ మూవీ స్ట్రీమ్ అవ్వనుంది. ఈ సమయంలో సందీప్ కిషన్… “2000 మందికి ఆహా సబ్స్క్రిప్షన్ మూడు నెలలు ఫ్రీ ఇస్తాను…” అంటూ ట్వీట్ చేశాడు. మరి ఒటీటీలో మైఖేల్ మూవీ ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.

Exit mobile version