Site icon NTV Telugu

Sundeep Kishan: భగవంతుడి ఆధీనంలో కూడా లేనిది కర్మ సిద్ధాంతం… ట్రైలర్ అదిరింది

Ooru Peru Bhairavakona

Ooru Peru Bhairavakona

యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న ఆడియన్స్ ముందుకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ ట్రైలర్ ని లాంచ్ చేసారు. దాదాపు రెండు నిమిషాల నిడివితో షార్ట్ అండ్ క్రిస్పీగా కట్ చేసిన ట్రైలర్ ఊరు పేరు భైరవకోన ప్రపంచాన్ని పరిచయం చేసింది. గరుడ పురాణంలోని మిస్ అయిన నాలుగు పేజీలు ఊరు పేరు భైరవకోన అనే డైలాగ్ తో విలేజ్ ని మిస్టీరియస్ గా ఎస్టాబ్లిష్ చేసాడు విఐ ఆనంద్. ట్రైలర్ కి శేఖర్ చంద్ర ఇచ్చిన మ్యూజిక్ గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది. ఆర్ట్ వర్క్ గొప్పదనం ట్రైలర్ తోనే తెలిసిపోతుంది. విజువల్ ఎఫెక్ట్స్ ని చాలా బాగా డిజైన్ చేసుకున్నారు.

విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్, సెట్ వర్క్ కారణంగా ఊరు పేరు భైరవకోన ట్రైలర్ కొత్తగా కనిపించి అట్రాక్ట్ చేస్తోంది. ట్రైలర్ లో సందీప్ కిషన్ లుక్ కూడా చాలా బాగుంది. సాంగ్స్, టీజర్ తో మంచి అంచనాలు సెట్ చేసిన ఊరు పేరు భైరవకోన టీమ్… ఇప్పుడు ట్రైలర్ తో మంచి ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసారు. రిలీజ్ డేట్ కి మూడు వారాల సమయం ఉంది కాబట్టి ఇకపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటకు రాబోతుంది. రిలీజ్ కి ముందు సెకండ్ ట్రైలర్ ని ఏమైనా రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. ఈ ట్రైలర్ క్రియేట్ చేసిన బజ్ ని ఫెబ్ 9 వరకూ క్యారీ చేయగలిగితే ఊరు పేరు భైరవకోన సినిమా హిట్ పడినట్లే.

Exit mobile version