Site icon NTV Telugu

Sundeep Kishan: ఊరిపేరు భైరవకోన రిలీజ్ డేట్ వచ్చేసింది…

Sundeep Kishan

Sundeep Kishan

యంగ్ హీరో సందీప్ కిషన్… హిట్ కోసం బాగా కష్టపడుతున్నాడు. సరైన హిట్ పడి చాలా కాలమే అయ్యింది కానీ సందీప్ కిషన్ ప్రయత్నం మాత్రం ఆపలేదు. రీసెంట్ గా వచ్చిన మైఖేల్ సినిమా కోసం బ్లడ్ అండ్ స్వెట్ షెడ్ అవుట్ చేసినా సందీప్ కిషన్ కి హిట్ పడలేదు. హిట్ అవుతుంది అనుకున్న సినిమా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో సందీప్ కిషన్ హిట్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కమర్షియల్ నుంచి రూటు మార్చిన సందీప్ కిషన్ థ్రిల్లర్ జానర్ లో లక్ టెస్ట్ చేసుకుంటున్నాడు. యునివర్సల్ అప్పీల్ ఉన్న థ్రిల్లింగ్ కథతో, క్రియేటివ్ గా సినిమాలు చెయ్యగల దర్శకుడు వీఐ ఆనంద్ తో కలిసి ‘ఊరిపేరు భైరవకోన’ సినిమా చేస్తున్నాడు సందీప్ కిషన్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో  టైగర్ సినిమా వచ్చింది.

ఈ మూవీ యావరేజ్ గా నిలవడంతో ఇప్పుడు ‘ఊరిపేరు భైరవకోన’ సినిమాతో సందీప్ కిషన్ హిట్ ట్రాక్ ఎక్కుతాడని ఆడియన్స్ భావిస్తున్నారు. ఊరి పేరు భైరవకోన ప్రమోషన్స్ కి సాంగ్స్ సూపర్ స్టార్ట్ ఇచ్చాయి. నిజమే నే చెబుతున్నా, హుమ్మా హుమ్మా సాంగ్స్ చార్ట్ బస్టర్ అయ్యాయి. టీజర్ తో భైరవకోన వరల్డ్ ని పరిచయం చేసిన చిత్ర యూనిట్, ఆడియన్స్ ని 100% ఇంప్రెస్ చేసారు. ప్రమోషనల్ కంటెంట్ తో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 9న రిలీజ్ అవనువుంది. ఊరి పేరు భైరవకోన ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుందంటూ మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ నిర్మించిన ఈ చిత్రంలో కావ్య థాపర్ కీలక పాత్రలో నటిస్తుండగా, రాజ్ తోట సినిమాటోగ్రఫి, చోటా కె ప్రసాద్ ఎడిటర్ లు గా వ్యవహరిస్తున్నారు. మరి ఈ సినిమాతో అయినా సందీప్ కిషన్ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.

Exit mobile version