Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!

Sigma Trailer 300kb

Sigma Trailer 300kb

Sigma Trailer: సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ‘సిగ్మా’పై ఇప్పటికే మంచి బజ్ ఉంది. తమిళ నాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండటంతో సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ ఏర్పడింది. లైకా ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ హీస్ట్ మూవీ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అండర్‌వరల్డ్ మాఫియా సామ్రాజ్యాన్ని ఢీకొట్టే హై-స్టేక్స్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా ట్రైలర్ లో ఏకంగా రూ.500 కోట్ల డ్రగ్స్, క్యాసినో రాకెట్‌ను ఢీకొట్టబోయే పాత్రలో సందీప్ కనిపించాడు. ట్రైలర్‌లో సందీప్ కిషన్ స్టైలిష్ బాడీ లాంగ్వేజ్‌తో పాటు ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్‌లో అతడి స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఫరియా అబ్దుల్లా కూడా కీలక పాత్రలో కనిపించడంతో పాటు సందీప్‌తో మంచి కెమిస్ట్రీని పంచుకున్నట్లు ట్రైలర్‌లో తెలుస్తోంది.

యాక్షన్, అడ్వెంచర్, కామెడీతో పాటు తల్లి కొడుకుల బంధానికి సంబంధించిన ఎమోషన్ కూడా కథలో కీలకంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అంటే భారీ దోపిడీ, క్రైమ్ రాకెట్ చుట్టూ కథ నడిచినా ఫ్యామిలీ ఎమోషన్స్ కి కూడా దర్శకుడు జాసన్ సంజయ్ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడిగా తన తొలి సినిమాతోనే కమర్షియల్ ఫార్మాట్‌లో ఓ భారీ కథను చెప్పే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. టెక్నికల్‌గా కూడా ‘సిగ్మా’ రిచ్‌గా కనిపిస్తోంది. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ విజువల్స్‌కు స్టైలిష్ లుక్ తీసుకొచ్చింది. ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీక్వెన్స్ కి మరింత ఎనర్జీ ఇచ్చింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు కూడా ట్రైలర్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్టోబర్ 2న ‘సిగ్మా’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు వెర్షన్‌ను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్, ఎన్వీఆర్ సినిమా కలిసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లతో బజ్ పెంచుకున్న ఈ సినిమా ట్రైలర్ కూడా యాక్షన్, హీస్ట్ ఎలిమెంట్స్‌తో మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. మరి జాసన్ సంజయ్ తన తొలి సినిమాతో ఎలాంటి థియేట్రికల్ అనుభూతిని అందిస్తారో అక్టోబర్ 2న చూడాలి.