Site icon NTV Telugu

Varun Tej: నిహారిక చిన్నపిల్ల.. లావణ్య కంటే ఆమె ముఖ్యం

Varuna

Varuna

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ప్రస్తుతం ఒక స్ట్రాంగ్ హిట్ కోసం కష్టపడుతున్నాడు. అందులో భాగంగానే వరుణ్ నటిస్తున్న తాజా చిత్రం గాండీవధారి అర్జున. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరుణ్ సరసన సాక్షి వైద్య నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఆగస్టు 25 న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో గతరాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు చిత్ర బృందం హాజరయ్యింది. కాగా, ఈ వేడుకలో వరుణ్ తేజ్ ను యాంకర్ సుమ ఒక ఆట ఆడేసుకుంది. వరుణ్ ఈ ఏడాది ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెల్సిందే. దీంతో పెళ్లి, కుటుంబం గురించి వరుణ్ ను ప్రశ్నలు అడిగి వినోదాన్ని పంచింది.

Renu Desai: అతని గురించి ఏది పడితే అది రాయకండి.. ట్విస్ట్ ఇచ్చిన పవన్ మాజీ భార్య

ముందుగా.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లలో ఎవరిని ఇమిటేట్ చేయడం ఇష్టం అని అడగ్గా.. వారిని చూడడం ఇష్టం.. చేయడం కష్టం అని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత.. పెళ్లి తరువాత రామ్ చరణ్, అల్లు అర్జున్ లో ఎవరు మారారు అని అడగ్గా .. పెళ్లి తరువాత ప్రతి ఒక్కరు మారాలి. అలా ఉంటేనే జీవితం బావుంటుంది అని తెలిపాడు. ఇక చివరగా.. లావణ్య, నిహారిక.. ఇద్దరు కాల్ మీ అర్జెంట్ అని మెసేజ్ పెడితే ఎవరికి కాల్ చేస్తారు అని అడగ్గా.. నిహారిక చిన్నపిల్ల కాబట్టి ఆమెకే కాల్ చేస్తా.. అని అన్నాడు. ఇక దీనికి సుమ.. చెల్లి అన్నందుకు మార్కులు ఇచ్చేస్తున్నాం.. లావణ్య తో మీరు ఇంటికెళ్లి చూసుకోవాలి అని నవ్వేసింది. ప్రస్తుతం ఈ ప్రశ్నలు నెట్టింట వైరల్ గా మారింది. అయితే దీనికి చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్నా చిన్నపిల్లా.. ? అని కొందరు.. ఎంత వయస్సు వచ్చిన మన ఇంటి బిడ్డ మనకు చిన్నపిల్లలానే కనిపిస్తుంది అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.

Exit mobile version