Sukumar’s Proteges with Back to Back Hits: ఒక దర్శకుడు దగ్గర పని చేసి తర్వాత దర్శకులుగా ట్రెండ్ ఇప్పటిది కాదు. టాలీవుడ్ పుట్టినప్పటినుంచి చాలామంది అలాగే దర్శకత్వం మెళుకువలు నేర్చుకుని దర్శకులుగా మారారు. అయితే ఈ జనరేషన్ లో సుకుమార్ దగ్గర పని చేసిన చాలా మంది దర్శకులుగా మారుతున్నారు. అలా దర్శకులుగా మారుతున్న వారిలో చాలామంది సూపర్ హిట్లు కొడుతూ గురువుకు తగ్గ శిష్యులు అని పేరు తెచ్చుకుంటున్నారు. అయితే వాళ్ళు ఎవరు ఏ ఏ సినిమాలో హిట్ కొట్టారు అనే వివరాలు మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ కుమారి 21ఎఫ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టు కొట్టాడు. ఇక ఆ తర్వాత ఆయన మరో శిష్యుడు బుచ్చిబాబు ఉప్పెన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏకంగా మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్లో చేరిపోయి రెండో సినిమానే రాంచరణ్ డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు.
Thotapalli Madhu: దెబ్బకు దిగివచ్చిన నటుడు.. క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్
ఇక మరో సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల అయితే మొదటి సినిమాతోనే దసరా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి ఇండస్ట్రీలో అందరికీ నొటెడ్ అవ్వడమే కాదు స్టార్లతో సినిమా చేసే అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఇక ఆ తర్వాత ఈ మధ్యనే విరూపాక్ష అనే సినిమాతో మరో సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఇక ఈ పరంపరలో తాజాగా ప్రసన్న వదనం అనే సినిమా చేరింది. సుకుమార్ శిష్యుల్లో ఒకరైన అర్జున్ కుమార్ దర్శకత్వంలో సుహాస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ పాజిటివ్ టాక్ దక్కించుకుని సుహాస్ కెరీర్ లో మరో హిట్టు పడేలా చేసిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకుని అది హిట్టా లేదా అనే విషయం తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి అయితే సినిమాకి పాజిటివ్ టాక్ ఉంది. మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతానికి సుకుమార్ శిష్యులు ఐదుగురు చేసిన మొదటి సినిమాలతోనే హిట్లు కొట్టి గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకున్నారు.
