Site icon NTV Telugu

Chiranjeevi and Sukumar : మెగాస్టార్ కోసం మెగాఫోన్ పట్టిన క్రియేటివ్ డైరెక్టర్

chiranjeevi

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ “పుష్ప” చిత్రంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిలో పడ్డాడు. ‘పుష్ప’రాజ్ హిందీలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. బాలీవుడ్ నుంచి కూడా సుకుమార్ కు ఆఫర్లు వస్తున్నాయి. సుకుమార్ అల్లు అర్జున్‌తో “పుష్ప: ది రూల్” కోసం సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ స్టార్ డైరెక్టర్ మెగా ఫోన్ పట్టబోతున్నాడు. ఈ విషయాన్ని సుకుమార్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవికి ఈ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి సుకుమార్‌తో కలిసి ఓ ప్రతిష్టాత్మక చిత్రం చేయబోతున్నారు.

Read Also : Daggubati Abhiram: ‘అహింస’ తో ఎంట్రీ ఇస్తున్న దగ్గుబాటి వారసుడు

సుకుమార్, చిరంజీవి చాలా కాలంగా కలిసి పని చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు చిరు మళ్లీ యాక్షన్‌లోకి రావడంతో పాటు సినిమాలకు సైన్ చేయడంలో బిజీగా ఉన్నారు. రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ‘పుష్ప’ పార్ట్-2 తర్వాత విజయ్ దేవరకొండను డైరెక్ట్ చేయనున్నాడు. అయితే విజయ్ ‘లైగర్’ తర్వాత పూరీతో కలిసి ‘జనగణమన’లోకి వెళ్తున్నాడు. సుకుమార్, చిరంజీవి కలయికలో రానున్న ఈ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ కాంబో. అయితే సుకుమార్ చిరంజీవిని సినిమా కోసం కాకుండా ఒక యాడ్ ఫిల్మ్ కోసం డైరెక్ట్ చేయబోతున్నాడని టాక్ నడుస్తోంది. సుకుమార్ ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన యాడ్ ఫిల్మ్‌ని డైరెక్ట్ చేయనున్నాడు.

https://www.youtube.com/watch?v=v97rAjyN_hQ
Exit mobile version