Sukumar Giving International Twist To Pushpa 2: సుకుమార్, అల్లు అర్జున్ కలయికలో వచ్చిన ‘పుష్ప’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు! తెలుగులో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోయినా.. ఇతర భాషల్లో మాత్రం అదిరిపోయే ఫలితాల్ని నమోదు చేసింది. దీంతో.. పుష్ప సీక్వెల్‌ని చాలా గ్రాండ్‌గా రూపొందించాలని సుకుమార్ నిర్ణయించాడు. నిజానికి.. తెలుగులో మాత్రమే రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో ‘పుష్ప: ద రైజ్’ని తెరకెక్కించారు. ఇప్పుడు దానికి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వచ్చిపడటంతో.. సీక్వెల్‌ను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు. అందుకు తగ్గ మార్పులు చేయడంలో సుకుమార్ నిమగ్నమయ్యాడు. అందుకే.. ఫిబ్రవరిలోనే సెట్స్ మీదకి వెళ్లాల్సిన ఈ చిత్రం, ఇంకా ఆలస్యం అవుతూ వస్తోంది.
ఇకపోతే.. లేటెస్ట్‌గా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు థాయిలాండ్‌తో కనెక్షన్ ఉంటుందని, అక్కడ ఒక కీలకమైన ఎపిసోడ్ షూట్ చేయాలని ప్లాన్ చేశారట! సీక్వెల్‌లో పుష్ప ఇంటర్నేషనల్ స్మగ్లర్‌గా అవతరించేలా చూపించనున్నారని, ఈ నేపథ్యంలోనే అతను థాయిలాండ్‌కి కూడా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయనున్నాడని అంటున్నారు. చూస్తుంటే.. సుకుమార్ చాలా పెద్ద స్కెచ్చే వేసినట్టు కనిపిస్తోంది. కాగా.. స్క్రిప్ట్ పనులు ఫైనల్ స్టేజ్‌కి వచ్చేయడంతో, త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సీక్వెల్‌లో ఫస్ట్ పార్ట్‌లో ఉన్న నటీనటులే కొనసాగనున్నారు. వారితో పాటు మరికొన్ని కొత్త పాత్రల్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయనున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు.