Site icon NTV Telugu

Sujitha: సూర్య కిరణ్ నా అన్న మాత్రమే కాదు.. మరో జన్మంటూ ఉంటే..

Sujitha

Sujitha

Sujitha:టాలీవుడ్ డైరెక్టర్ సూర్యకిరణ్ మృతి చెందిన విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా పచ్చ కామెర్లతో బాధపడుతున్న ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇక కంటికి పచ్చ కామెర్లు కావడంతో పరిస్థితి విషమించి కొద్దిసేపటి క్రితమే ఆయన మృతి చెందారు. తెలుగు, తమిళ్ భాషల్లో సూర్యకిరణ్ చాలా మంచి చిత్రాల్లో నటించడమే కాదు.. మంచి సినిమాలను కూడా తెరకెక్కించారు. ఆయన మృతి పట్ల ఎంతోమంది ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. తాజాగా సూర్య కిరణ్ చెల్లి, నటి సుజిత అన్నను తలుచుకొని ఎమోషనల్ అయ్యింది.

సుజిత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమాలో బాలనటిగా నటించింది. అమ్మాయి అయినా కూడా అందులో అబ్బాయిలా నటించి మెప్పించింది. ఇక వదినమ్మ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులను కూడా తన ఫ్యాన్స్ గా మార్చుకుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో, సీరియల్స్ తో నటిస్తున్న సుజిత.. అన్న సూర్య కిరణ్ మృతిని తలుచుకొని ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టింది. ” చేటా.. మీ ఆత్మకు శాంతి కలుగును గాక. నా సోదరుడు మాత్రమే కాదు, నా హీరో,నా తండ్రి. నీ ప్రతిభకు, నీ ప్రసంగాలకు నేనెప్పుడు అభిమానినే. మరో జన్మంటూ ఉంటే అప్పుడైనా నీ కలలన్నీ సాకారం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version