Suhasini Maniratnam: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ము హైదరాబాద్ లో నిర్వహించారు.
ఇక ఈ వేడుకలో మణిరత్నం భార్య.. నటి సుహాసిని మణిరత్నం మాట్లాడుతూ” 42 ఏళ్లుగా మీరు నన్ను ఆదరిస్తున్నారు.. నన్ను ఆదరించినట్టే ఈ సినిమాను కూడా ఆదరించండి. సినిమా గురించి నేనెమీ మాట్లాడను. ఒక చిన్న విషయం చెప్తాను. మణిరత్నం నా పెళ్లి ముందు నన్ను కలిసినప్పుడు ఒక పెద్ద బ్యాగ్ తీసుకొని వచ్చాడు. అందులో చీరలు, డ్రెస్ లు ఉంటాయని అనుకున్నాను.. కానీ అందులో చోళుల రాజ్యానికి సంబంధించిన పొన్నియన్ సెల్వన్ ఐదు పుస్తకాలు ఉన్నాయి. వాటిని నాకు ఇచ్చి చదివి ఒక్క లైన్ లో కథను చెప్పమని చెప్పారు. నేను కూడా చదివి ఒక పేపర్ పై ఒక్క లైన్ లో కథను రాసి ఇచ్చాను.. అందుకు ఆయన ఏంటి ఇదా నువ్వు రాసింది.. ఇదా నీకు అర్ధమయ్యింది అన్నారు. దీంతో ఈ పుస్తకాల వలన నా పెళ్లి కూడా ఆగిపోతుందనుకున్నాను.. కానీ, పెళ్లి అయితే జరిగింది. ఆయన ఈ సినిమాను అంత నమ్మారు” అని చెప్పుకొచ్చింది. ఇక సినిమాలో పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపిన సుహాసిని సినిమాను చూసి విజయం అందించామని కోరింది.
