Sudigali Sudheer’s Calling Sahasra to release on November: బుల్లి తెర ప్రేక్షకులను అలరించి తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ‘గాలోడు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మించారు. సుధీర్ సరసన డాలీషా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా నిర్మాత వెంకటేశ్వర్లు కాటూరి మాట్లాడుతూ ‘‘నిర్మాతలుగా ‘కాలింగ్ సహస్ర’ మా తొలి అడుగు అని మాకు ఇదొక స్వీట్ మెమరీ అని అన్నారు. డైరెక్టర్ అరుణ్, హీరో సుధీర్, హీరోయిణ్ డాలీషా సపోర్ట్‌తో సినిమాను పూర్తి చేశామని, ఔట్ పుట్ సూపర్‌గా వచ్చిందని అన్నారు.
Charan Raj: డైరెక్టర్ వెంటపడ్డా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు.. చరణ్ రాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సరికొత్త సుధీర్‌ను చూస్తారని నమ్మకంగా చెబుతున్నా, ఇందులో సుధీర్ పాత్రను వెండి తెరపై చూసిన ఆడియెన్స్ వామ్మో సుధీర్ ఇలాంటి పాత్రలో కూడా నటిస్తారా అనేంత వైల్డ్‌గా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో, మాసీగా ఉంటుందని, ప్రేక్షకులు ఊహించని మలుపులతో సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఆకట్టుకోనుంది మా కాలింగ్ సహస్ర మూవీ అని అన్నారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, నవంబర్‌లో సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.శివబాలాజీ మనోహరన్, రవితేజ నన్నిమాల తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రచన దర్శకత్వం అరుణ్ విక్కీరాల. మార్క్ కె రాబిన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి సన్ని.డి సినిమాటోగ్రఫీ అందించారు.