Sudigali Sudheer to Campaign for Pawan Kalyan: ఏపీ సహా తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ప్రచారాలు పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బిజెపితో కలిసి కూటమి ఏర్పాటు చేసి బరిలోకి దిగింది. కూటమి అభ్యర్థిగా జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారనే విషయం తెలిసినప్పటి నుంచి సినీ నటులు, టెక్నీషియన్లు కొంత మంది ఆయన కోసం పిఠాపురంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. .
Actress Rupali Ganguly: బీజేపీలో చేరిన ఫేమస్ టీవీ నటి రూపాలీ గంగూలీ
ఇక ఇప్పటికే గెటప్ శ్రీను, హైపర్ ఆది, జానీ మాస్టర్, నిర్మాతలు ఎస్కేఎన్, బన్నీ వాసు వంటి వాళ్ళు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండగా ఇప్పుడు మరో స్టార్ కమెడియన్ కూడా అందులో జాయిన్ అయ్యాడు. అతను ఎవరో కాదు బుల్లితెరలో మంచి క్రేజ్ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్. ఈ రోజు ఎన్నికల ప్రచారంలో సుడిగాలి సుధీర్, గెటప్ శీను పాల్గొననున్నారు. ఈ క్రమంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీపాద శ్రీ వల్లభ దేవస్థానాన్ని జబర్దస్త్ ఫ్రేమ్ సుడిగాలి సుధీర్, గెటప్ శీను దర్శించుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు యు కొత్తపల్లి మండలంలో 15 గ్రామాల్లో పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం నిర్వహించనున్నారు.
