Site icon NTV Telugu

Sudigali Sudheer: G.O.A.T కోసం రంగంలోకి సుడిగాలి సుధీర్

Sudigali Sudheer

Sudigali Sudheer

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న G.O.A.T (గోట్) GreatestOfAllTimes ప్రమోషన్స్ కి ఎట్టకేలకు వచ్చాడు. దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి ముందు పాగల్ డైరెక్టర్ నరేష్ డైరెక్షన్ చేయగా వేదవ్యాస్‌ పూర్తి చేశాడు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణ‌వ్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత‌. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోన్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్‌కు, సాంగ్స్‌కు అనూహ్య రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి రైజ్‌ ఆఫ్‌ గణ అనే లిరిక‌ల్ వీడియోను సోమవారం విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్‌. ఇటీవల సీఎమ్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాళాలలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఈ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.

Also Read:Vizag Crime: మైనర్‌ బాలిక కిడ్నాప్‌, అత్యాచారం.. 12 ఏళ్ల తర్వాత యూపీలో దొరికిన నిందితుడు..

లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్‌ సంగీతం అందించారు. చిత్రంలో హీరో క్యారెక్టరైజేషన్‌ను తెలిపే విధంగా ఎంతో పవర్‌ఫుల్‌ మాస్‌గా ఈ సాంగ్‌గా ఉండబోతుంది. పాటలో ఉన్న విజువల్స్‌, సాహిత్యం కూడా అందర్ని ఆకట్టుకుంటుంది. నిర్మాత మాట్లాడుతూ ప్ర‌స్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా చాలా రిచ్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. టెక్నికల్‌గా కూడా చిత్రం ఉన్నతస్థాయిలో వుంటుంది. సుడిగాలి సుధీర్ కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది. ఈరోజు విడుదల చేసిన ఈ పాట కూడా ఎంతో రిచ్‌గా ఉంటుంది. సినిమా ఆద్యంతం ప్రతి ఫ్రేమ్‌ ఎంతో అద్భుతంగా ఉంటుంది. చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు. సుడిగాలి సుధీర్‌, దివ్యభారతి, సర్వధమన్‌ బెనర్జీ, నితిన్‌ ప్రసన్న, బ్రహ్యాజీ, పృథ్వీ, ఆడుకాలం నరేష్‌, రాజేంద్రన్‌, ఆనంద్‌ రామరాజ్‌, చమ్మక్‌ చంద్ర, పమ్మీ సాయి, నవీన్‌ నేని, తదితరులు నటిస్తున్నారు. అయితే ముందు విభేదాల కారణంగా ప్రమోషన్స్ కి దూరంగా ఉన్న సుడిగాలి సుదీర్ ఇప్పుడు ప్రమోషన్స్ కి కూడా హాజరు కావడం గమనార్హం.

Exit mobile version