Site icon NTV Telugu

రవితేజ 70 అఫిషియల్ అనౌన్స్మెంట్… ఆసక్తికరంగా పోస్టర్

RT70

RT70

మాస్ మహారాజ రవితేజ 70వ చిత్రాన్ని ఈరోజు ఉదయం అధికారికంగా ప్రకటించారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ లోగోను నవంబర్ 5న ఉదయం 10:18 గంటలకు విడుదల చేయనున్నారు. “హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్” అనే ట్యాగ్‌లైన్‌తో కూడిన ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా ప్రకటన రవితేజ 70వ సినిమాను ప్రకటించారు. పోస్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న పురాతన ఆలయ శిల్పాలు సినిమాపై ఉత్సుకతను పెంచుతున్నాయి. రవితేజ 70వ చిత్రం కాన్సెప్ట్ బేస్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. “స్వామి రారా”, “కేశవ” ఫేమ్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అభిషేక్ పిక్చర్స్ తో పాటు రవితేజ ఆర్టి టీమ్‌వర్క్స్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా పవర్‌ఫుల్ కథను అందించారు. చిత్రం తారాగణం, సిబ్బందికి సంబంధించిన మరిన్ని వివరాలు నవంబర్ 5న విడుదల కానున్నాయి.

Read Also : సీనియర్ నటుడు కైకాలకు స్వల్ప అస్వస్థత

Exit mobile version