NTV Telugu Site icon

Sudheer Babu: మహేష్ బావ కోరిక మాములుగా లేదుగా.. రాజమౌళితోనే కావాలంట

Mahesh

Mahesh

Sudheer Babu: విభిన్నమైన కథలను ఎంచుకొనే హీరోల్లో సుధీర్ బాబు ఒకడు. మహేష్ బాబు బావగా తెలుగుతెరకు పరిచయమైనా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సుధీర్ నటిస్తున్న చిత్రం హంట్. మహేష్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, భరత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 26 అనగా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక సినిమా రిలీజ్ దగ్గరపడడంతో వారం నుంచి సుధీర్ బాబు వరుస ఇంటర్వ్యూలతో బిజీగా మారాడు. మరోపక్క సోషల్ మీడియాలో సైతం అభిమానులతో చిట్ చాట్ నిర్వహించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నాడు.

ఇక తాజాగా ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సుధీర్ ఇచ్చిన సమాధానం మహేష్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. అదేంటంటే.. “నువ్వు మహేష్ అన్నతో నటిస్తే చూడాలని ఉంది అన్న” అని అభిమాని అడిగిన ప్రశ్నకు సుధీర్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. “నాక్కూడా.. అది కూడా రాజమౌళి గారి మూవీ అయితే” అంటూ సమాధానమిచ్చాడు. దీంతో అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మహేష్ బావ కోరిక మాములుగా లేదుగా అని కొందరు.. సూపర్ బ్రో.. విలన్ గా మంచి కటౌట్ ఉంది అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇక ఇంకొందరు ఆహా.. రాజమౌళికి హింట్ ఇస్తున్నావా..? అని కామెంట్స్ చేస్తున్నారు.ఇక మహేష్ బాబు- రాజమౌళి కాంబో త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెల్సిందే. మరి బావ కోరికను మహేష్ తీరుస్తాడో లేదో చూడాలి.

Show comments