మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ మొత్తానికి విడుదలకు అన్ని పనులను పూర్తి చేసుకుంది. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ యూసుఫ్ గూడలో జరుగుతున్న విషయం విదితమే. ఈ ఈవెంట్ కు మహేష్ సోదరి భర్త, నటుడు సుధీర్ బాబు గెస్ట్ గా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఆయన మహేష్ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. “అందరికి నమస్కారం.. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లా లేదు.. ఒక సూపర్ హిట్ ఫంక్షన్ లా ఉంది నాకు.. దానికి ముఖ్య కారణం ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఏది రిలీజ్ అయినా సరే అది చాలా బావుంది కాబట్టి. నాకు ఎప్పుడు ఒక ప్రాబ్లమ్.. మీరేమో మహేష్ గురించి మట్లాడమంటారు.. నేను ఆయన గురించి మాట్లాడితే మహేష్ కు నచ్చదు.. కానీ ఈరోజు మాట్లాడతాను .. కొంచెం కాంట్రవర్సీ అవుతుంది పర్లేదు.. అక్కడక్కడా చిన్న చిన్న స్టేట్మెంట్లు వినిపిస్తున్నాయి. వింటేజ్ మహేష్.. వింటేజ్ మహేష్ అని.. దాన్ని నేను ఒప్పుకోను.. సెటిల్ పెర్ఫార్మెన్స్ చేసినా, హైపర్ యాక్టివ్ చేసినా, ఒక బిజినెస్ మ్యాన్ లా సీరియస్ ఇంటెన్సివ్ రోల్ చేసినా, కామెడీ చేసినా, మహేష్ అంటేనే ఎందుకంటే మహేష్ అన్ని పాత్రలకు సెట్ అవుతాడు. అన్నిటిలోను వింటేజ్ కనిపిస్తోంది.
ఏ పాత్రనైనా అవలీలగా చేయగలిగే బిగ్ సూపర్ స్టార్ మహేష్ మాత్రమే.. అని నా ఫీలింగ్.. కేవలం ఆయన పాత్రలను ఎంపికచేసుకోవడంలోనే ఉంటుంది. ఇక అలాగే ఈ మధ్యన పాన్ ఇండియా పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ మహేష్ విషయంలో పాన్ ఆడియన్స్ అనే పదం వాడాలి అనుకుంటున్నాను. ఎందుకని అంటున్నాను అంటే మహేష్ సినిమా రిలీజ్ అయితే ఇంటర్ స్టూడెంట్ చూస్తాడు.. ఇద్దరు మనవళ్లు ఉన్న తాత చూస్తాడు.. ఒక ఐటీ ఎంప్లాయ్ చూడాలనుకుంటాడు.. ఇంకోపక్క కూలి పని చేసుకొనే వ్యక్తి అందరు చూడాలనుకుంటారు. మహేష్ క్లాస్ సినిమా చేస్తే ఫీమేల్ ఆడియెన్స్, మాస్ సినిమా చేస్తే మాస్ ఆడియెన్స్ అంతే.. 150 కోట్ల షేర్ తో ఈ సినిమా మొదలు కావాలి అని కోరుకొంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

