Sudhakar Komakula’s ‘Narayana and Co’ now streaming on amazon prime video: ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన నటుడు సుధాకర్ కోమాకుల తాజాగా ‘నారాయణ అండ్ కో’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ ‘నారాయణ అండ్ కో’ మూవీ జూన్ 30వ తేదీన థియేటర్లోకి వచ్చి మంచి స్పందన తెచ్చుకుంది. పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్లపై పాపిశెట్టి బ్రదర్స్ సహకారంతో సుధాకర్ స్వయంగా ఈ మూవీని నిర్మించారు. శ్రీనివాస్ గొర్రిపూడి ఈ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించగా చిన పాపి శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ నారాయణ అండ్ కో… ‘ది తిక్కల్ ఫ్యామిలీ’ ట్యాగ్ లైన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Ram Charan: బ్రేకింగ్: స్టార్ క్రికెటర్ బయోపిక్ లో రామ్ చరణ్?
ఇక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చుట్టూ తిరిగే కథ, ఫన్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ఎంటర్‌టైనింగ్ గా సాగింది. మధ్య తరగతి కుటుంబాన్ని లీడ్ చేసే యజమాని నారాయణ పాత్రలో డైరెక్టర్, నటుడు దేవీ ప్రసాద్ ప్రేక్షకులను తనదైన శైలిలో అలరించి ఆకట్టుకున్నారు. ఆయన అతని భార్య పాత్రలో సీనియర్ నటి ఆమని నటించగా… కొడుకు పాత్రలో సుధాకర్ నటించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది, థియేటర్ లో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు నారాయణ అండ్ కో సినిమాను అమెజాన్ ప్రైమ్ లో వీక్షించవచ్చని సినిమా యూనిట్ వెల్లడించింది.