Site icon NTV Telugu

Kollywood: తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో రచ్చ లేపుతున్న సుధా కొంగర కామెంట్స్…

Sudha Kongara

Sudha Kongara

గురు, ఆకాశం నీ హద్దురా లాంటి మంచి సినిమాలు చేసిన డైరెక్టర్ సుధా కొంగర ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. తమిళ సినీ అభిమానులు సుధా కొంగరని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఇంత రచ్చ జరగడానికి కారణం ఏంటంటే… డైరెక్టర్ అమీర్ తెరకెక్కించిన ‘రామ్’ అనే సినిమా 2005లో రిలీజ్ అయ్యింది. జీవా హీరోగా నటించిన ఈ సినిమా కోలీవుడ్ లో చాలా మంచి హిట్ అయ్యింది. స్లో పాయిజన్ లా హిట్ అయిన ‘రామ్’ సినిమా చూడడానికి అప్పటిలో అసిస్టెంట్ డైరెక్టర్ గా మణిరత్నం దగ్గర వర్క్ చేస్తున్న హీరో కార్తీ, సుధా కొంగర అండ్ స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ హౌజ్ హెడ్ కే.ఈ.జ్ఞానవేల్ రాజాలు థియేటర్ కి వెళ్లారట. రామ్ సినిమాని చూసిన సుధా కొంగర అసలు మూవీలో మేకింగ్ యే లేదు, సినిమా బాగోలేదు అనుకుంటూ థియేటర్స్ నుంచి బయటకి వచ్చిందట. అసలు 2005లో జరిగిన విషయం ఇప్పుడు ఎలా బయటకి వచ్చింది అంటే జ్ఞానవేల్ రాజా ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సుధా కొంగర అన్న మాటలని రివీల్ చేసాడు.

ఈ కారణంగా సోషల్ మీడియా అంతా సుధా కొంగరని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ అమీర్ సుల్తాన్ పరుత్తివీరన్ లాంటి క్లాసిక్ సినిమా తెరకెక్కించాడు, ఇప్పుడు నటుడిగా మారిన అమీర్ అభిమానులు… సుధా కొంగర సారీ చెప్పాల్సిందే అంటూ రచ్చ చేస్తున్నారు. దీంతో సుధా కొంగర రెస్పాండ్ అవుతూ… “నాకు అమీర్ అంటే ఎంతో రెస్పెక్ట్ ఉంది. నా సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కోసం పరుత్తివీరన్ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ని ఎంత స్ట్రాంగ్ గా రాశాడో చూసి నేర్చుకున్నాను. అది నాకు తనపై ఉన్న గౌరవం” అంటూ ట్వీట్ చేసింది. సుధా చేసిన ట్వీట్ కి కూడా “అవన్నీ అవసరం లేదు రామ్ సినిమాపై కామెంట్స్ చేసారో లేదో చెప్పండి” అంటూ రిప్లైలు వస్తున్నాయి. కోలీవుడ్ లో ఈ వ్యవహారం హాట్ హాట్ గా ఉంది, మరి ఇది ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి.

Exit mobile version