Site icon NTV Telugu

Sudha Kanduri: హీరోగా దసరా విలన్.. మలయాళంలో హీరోయిన్ గా తెలుగమ్మాయి ఎంట్రీ!

Sudha Kanduri

Sudha Kanduri

Sudha Kanduri as Heroine in Shine tom Chacko Movie: టెక్సాస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై శ్రీ అమ్‌జిత్ ఎస్‌కె రెండో చిత్రం “తేరీ మేరీ” షూటింగ్ తాజాగా మొదలైంది. నిజానికి మొదట ప్రకటించినప్పుడు ఈ చిత్రంలో హనీ రోజ్, షైన్ టామ్ చాకో, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషిస్తారని ప్రచారం జరిగింది. అంతేకాదు నూతన దర్శకుడు శ్రీరాజ్ ఎం రాజేంద్రన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి సుకుమారన్ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీ అందిస్తారని ప్రకటించారు. ఆర్తి మిథున్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే సంభాషణలు అందించనున్నారని అన్నారు. అయితే ఆసక్తికరంగా హనీ రోజ్ తప్పుకోవడంతో తిరుపతికి చెందిన మెడికల్ స్టూడెంట్, సోషల్ మీడియా స్టార్ శ్రీరంగ సుధా కండూరి హీరోయిన్ గా మారింది. ఇక కథ, స్క్రీన్‌ప్లే సంభాషణలు అందించడానికి రెడీ అయిన ఆర్తి మిథున్ దర్శకురాలిగా మారింది. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

Rashmi: ఒక్క ఫొటో చాలు… సొల్లు కారుస్తారు, దాంతో నాకు పనేముంది?

మలయాళ సినిమాల్లో RED V RAPTOR(X) 8K కెమెరాను ఉపయోగించి చిత్రీకరించిన మొదటి సినిమాగా ఈ సినిమా నిలవనుంది. మంజుమ్మేల్ బాయ్స్ ఫేమ్ శ్రీనాథ్ భాసి, దసరా విలన్ షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాతో తెలుగమ్మాయి,గాయని, వైద్య విద్యార్థిని శ్రీరంగ సుధ కథానాయికగా మలయాళంలోకి రాబోతోంది. టెక్సాస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై అమ్జిత్ ఎస్‌కె, సమీర్ చెంపైల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వర్కాల జనార్దనస్వామి ఆలయం ముందు షూటింగ్ ప్రారంభమైంది. టూరిజం ద్వారా వర్కాలలో నివసించే ఇద్దరు స్థానిక యువకుల జీవితాలను ఆసక్తికరంగా ప్రెజెంట్ చేసే సినిమాగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్న రేష్మా రాజన్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఇర్షాద్ అలీ, సోహన్ శీనులాల్, షాజు శ్రీధర్, బబితా బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు మరికొందరు కొత్త ముఖాలు కూడా పరిచయం కాబోతున్నారు.

Exit mobile version