Site icon NTV Telugu

Lyca : సుభాస్కరన్ ప్రెజెంట్స్.. లైకా ప్రొడక్షన్స్ కేరాఫ్ డిజాస్టర్స్

Lyca

Lyca

లైకా ప్రొడక్షన్స్‌ అంటే ఫ్లాపులకు డిజాస్టర్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్ అయిపోయింది. ఏ హీరో నటించినా ఫ్లాప్‌ గ్యారెంటీ అనేట్టుగా మారిపోయింది. పొన్నియన్‌ సెల్వన్‌తో మంచి లాభాలు చూసిన లైకా ఆతర్వాత డిజాస్టర్స్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మూడేళ్లనుంచి లైకా నుంచి వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద చేతులెత్తేస్తున్నాయి. అజిత్‌ ఫ్యాన్స్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘విదామయూర్చి’ వీకెండ్‌ సినిమాగా మిగిలిపోయింది. తెలుగులో పట్టుదల పేరుతో రిలీజై కోటి కూడా కలెక్ట్‌ చేయలేయలేదు. అజిత్‌కు తమిళంలో మాంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వున్నా  సరైన కథ ట్రీట్‌మెంట్ లేకపోవడంతో తమిళ తంబీలు రిజక్ట్ చేశారు.

Also Read : Tollywood : సమ్మర్ హాలిడేస్ కు ఇద్దరు స్టార్ హీరోలు

కూతురు ఐశ్వర్య డైరెక్షన్‌లో రజనీకాంత్‌ నటించిన ‘లాల్‌ సలాం’ లైకాను కోలుకోలేనంతగా దెబ్బ కొట్టింది. రజనీకాంత్‌తో తీసిన ‘వెట్టయాన్‌’కూడా  యావరేజ్ గా నిలిచింది. లైకా నుంచి ఏది వచ్చినా ఫ్లాప్‌ బాటే పట్టడం కోలీవుడ్‌ను కలవరపెడుతోంది. హిందీలో అక్షయ్‌కుమార్‌తో తీసిన రామ్‌సేతు బాక్సాఫీస్‌ వద్ద తేలిపోయింది. చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి2 మరో మరో ప్లాప్. ఇక భారతీయుడు2 అయితే విమర్శలతోపాటు వందల కోట్లు నష్టాలతో ప్రొడక్షన్‌ హౌస్‌ను ముంచింది. ఇక లైకా ప్రొడక్షన్స్‌ను ఇక లూసిఫర్‌ సీక్వెలే రక్షిస్తుందనుకుంటే వివాదాలు చుట్టుముట్టాయి. హైప్‌ కారణంగా మంచి ఓపెనింగ్స్‌ వచ్చినా పృథ్వీరాజ్‌కు మాత్రం చెడ్డ పేరు తీసుకొచ్చింది. పెద్ద పెద్ద హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్స్‌ తీసిన లైకా ప్రొడక్షన్స్‌ చేతిలో ప్రస్తుతం సందీప్‌ కిషన్‌ హీరోగా విజయ్ కొడుకు దర్శకత్వంలో సినిమాతో పాటు మరో సినిమా మాత్రమే ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న లైకాకు ఫండర్ దొరకాలి. అలాగే మంచి కథలతో బౌన్స్ బ్యాక్ అవ్వాలి. లేదంటే లైకా మరో ప్లాప్ బ్యానర్ గా దుకాణం సర్దేయాల్సి వస్తుంది.

Exit mobile version