NTV Telugu Site icon

Ravi Teja: ‘టైగర్’ కోసం రంగంలోకి స్టూడియో గ్రీన్.. ఇక నో టెన్షన్

Tigernageswararao Trailer

Tigernageswararao Trailer

Studio Green to Release Tiger Nageswar rao movie in tamilnadu: మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన తొలి పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ దసరా సందర్భంగా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న సన్నగతి తెలిసిందే. స్థూవర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకుడు వంశీ ఎంతో పరిశోధన చేసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్న అభిషేక్ అగర్వాల్ ఖర్చుకు వెనకాడకుండా మంచి నిర్మాణ విలువలతో సినిమా తెరకెక్కించారు. ముంబై వెళ్లి హిందీ మీడియాలో కూడా సినిమాకు ప్రచారం చేస్తున్నాడు రవితేజా. అక్టోబర్ 20న విడుదలకు అంతా సిద్ధమైంది కానీ హిందీ మినహా మిగిలిన భాషల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాకు పెద్దగా ప్రచారం లేదని అంటున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ సినిమాకు థియేటర్లు దొరకడం లేదని అంటున్నారు.

Jr NTR: బాబు అరెస్టుపై ఎన్టీఆర్ అందుకే స్పందించలేదని అనుకుంటున్నా.. రాజీవ్ కనకాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఎందుకంటే ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదల కావడానికి ఒక్కరోజు ముందు దళపతి విజయ్ ‘లియో’ సినిమా థియేటర్లలోకి వస్తోన్న క్రమంలో తమిళనాడులో అన్ని థియేటర్లను ఈ సినిమా ఆక్యుపై చేసేసిందని అంటున్నారు. నిన్నటి వరకు ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాకు ఓకే అయిన థియేటర్లు కేవలం 27 మాత్రమేనని మహా అయితే మరో 10 నుంచి 15 థియేటర్లు దొరుకుతాయని ప్రచారం జరుగుతున్న సమయంలో మీకు మేమున్నాం అంటూ రంగంలోకి దిగింది స్టూడియో గ్రీన్ సంస్థ. ఈ సినిమాను తమిళంలో తాము రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది సదరు సంస్థ. దీంతో ఈ సినిమాకి తమిళనాడులో కూడా మంచి థియేటర్లు దొరకవచ్చని అంటున్నారు.

Show comments