Site icon NTV Telugu

Allu Aravind: కాంట్రవర్షియల్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం అదేనా?

Allu Aravind

Allu Aravind

గీతా గోవిందం కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ పరశురామ్ పెట్ల, విజయ్ దేవరకొండ కలిసి ఒక సినిమాని అనౌన్స్ చేశారు. దిల్ రాజు ప్రొడక్షన్ అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ టాలీవుడ్ లో కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. గీత గోవింద తర్వాత గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే పరశురామ్ ఒక సినిమా కమిట్ అయ్యాడు. ఆ బ్యానర్ నుంచి భారి మొత్తంలో అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు కానీ సడన్ దిల్ రాజు బ్యానర్ లో సినిమా అనౌన్స్ చెయ్యడం టాలీవుడ్ వర్గాలకి షాక్ ఇచ్చింది. దీంతో అల్లు అరవింద్ ఈరోజు సాయంత్రం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ ఇష్యూని అడ్రెస్ చెయ్యాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలో అల్లు అరవిండ్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయ్యింది అనే వార్త బయటకి వచ్చింది. ఫిబ్రవరి 19న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టే దాన్ని దృష్టిలో పెట్టుకోని ‘గిల్డ్ మెంబర్స్’ అల్లు అరవింద్ ని ప్రెస్ మీట్ కాల్ ఆఫ్ చెయ్యమని రిక్వెస్ట్ చేసారట.

దీంతో అల్లు అరవింద్-దిల్ రాజు-పరశురామ్ లు ప్రైవేటుగా కూర్చోని ఇష్యూ సార్ట్ అవుట్ చేసుకుంటున్నారు. నిజానికి పరశురామ్ ‘సర్కారు వారి పాట’ తర్వాత నాగ చైతన్యతో సినిమా చెయ్యాల్సి ఉంది కానీ చైతన్య ఎందుకు తప్పుకున్నాడో తెలియదు కానీ ఇప్పుడు అదే కథతో పరశురామ్ రౌడీ హీరోతో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు. ఒక హీరో కాదు అంటే ఇంకో హీరోతో సినిమా చెయ్యోచు కానీ ఒక ప్రొడ్యూసర్ తో అడ్వాన్స్ తీసుకోని సినిమా కమిట్ అయిన దర్శకుడు ఇంకో ప్రొడక్షన్ హౌజ్ తో అదే సినిమాని చెయ్యడం అనేది కరెక్ట్ కాదని కొందరు ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version