అక్కినేని నాగ చైతన్య నెక్స్ట్ మూవీ గురించి ఆసక్తికర బజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ‘మానాడు’తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు తన నెక్స్ట్ మూవీ నాగ చైతన్యతో ఉంటుందని వెల్లడించారు. ఇది వెంకట్ ప్రభు రూపొందిస్తున్న తొలి స్ట్రెయిట్ తెలుగు సినిమా కావడం విశేషం. 90వ దశకం నేపథ్యంలో సాగే ద్విభాషా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ రూపొందనుందని వెంకట్ ప్రభు తెలిపారు. ఇంకా అధికారికంగా ప్రకటించని ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుందని సమాచారం. తాజా బజ్ ప్రకారం సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ను కూడా ఫిక్స్ చేసేసారట. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఈ మూవీకి సంగీతం అందించనున్నారని తెలుస్తోంది. యువన్ తెలుగు సినిమాలు చేసి చాలా కాలం అయ్యింది. డిఫరెంట్ జానర్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
Read Also : RC15 : నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్స్ ఏంటంటే ?
ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థాంక్యూ” అనే చిత్రంలో నటిస్తున్నాడు చైతన్య. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి
చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ మధ్యే నాగ చైతన్య ఆ దర్శకుడితోనే “దూత” అనే వెబ్ సిరీస్ ను కూడా స్టార్ట్ చేశాడు.
