Site icon NTV Telugu

AR Rahman: విడాకులు వాపస్..గుడ్ న్యూస్ చెప్పిన సెలబ్రెటి జంట..!

February 7 2025 02 24t083321.654

February 7 2025 02 24t083321.654

ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. బంధాల విలువ తగ్గుతోందా..? లేక మనుషులే బంధాలకు విలువ ఇవ్వడం లేదో, తెలియదు కానీ.. చిన్న గొడవలకు కూడా సర్దుకుపోవడం పూర్తిగా మానేశారు జనాలు. ఇందుకు ఒక్కింత సంపాదన కూడా కారణం అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజులో భర్తకు సమానంగా భార్యలు కూడా సంపాదిస్తున్నారు. ఆ ధైర్యం తోనే బ్రతకగలం అనే నమ్మకంతో సర్దుకోవడం మానేసి విడిపోతున్నారు. అందులో సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Also Read: Vishnu: మా ఫ్యామిలి గొడవలకు త్వరగా ఫుల్‌స్టాప్‌ పడితే బాగుండు: మంచు విష్ణు

ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధంగా పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా చాలామంది నటీనటుల జీవితాలు ఇలాగే ఉన్నాయి. తెలుగులో నాగచైతన్య-సమంత,డైరెక్టర్ క్రిష్, చిరంజీవి కూతురు శ్రీజ,పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్,నిహారిక ఇలా చాలామంది తెలుగు సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. తమిళంలో ధనుష్,కమల్ హాసన్,వంటి వారితో పాటు, బాలీవుడ్‌లో అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి సూపర్ స్టార్ తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఇక ఈ లిస్ట్‌లో స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా చేరారు.

ఇటివల కాలంలో ఏఆర్ రెహమాన్ భార్య సైరా భాను తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. విడాకులపై సైరా భాను మాట్లాడుతూ.. ‘తమ మధ్య అంతులేని దూరం పెరిగిపోయిందని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాన’ అని సైరా భాను ప్రకటించింది. ఇక విషయం తెలిసి సినీ వర్గాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి. అయితే తాజాగా సమాచారం ప్రకారం ఈ జంట తిరిగి కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.అవును ఇటీవల సైరా భాను అనారోగ్యంతో బాధపడితే ఏఆర్ రెహమాన్ అండగా నిలిచాడట. ఈ విషయాన్ని సైరా భాను తరుపు లాయర్ బయటపెట్టింది. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఏఆర్ రెహమాన్ తనకు అండగా నిలిచాడు అంటూ తెలిపింది.

Exit mobile version