NTV Telugu Site icon

Prithviraj Sukumaran: మాలీవుడ్ ఇండస్ట్రీ పై స్టార్ హీరో వైరల్ కామెంట్స్..

Prudhvi Raj

Prudhvi Raj

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు టాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇందులో మలయళ స్టార్ హీరో పుధ్వీరాజ్ సుకుమారన్‌ ఒకరు. ‘సలార్’ మూవీలో ప్రభాస్‌తో సమానంగా నటించి తెలుగులో తిరుగులేని పాపులారిటి దక్కించుకున్నాడు. ఇక ప్రజంట్ స్వీయ దర్శకత్వంలో ‘లూసిఫర్‌2: ఎంపురాన్‌’ మూవీలో నటిస్తున్నాడు పుధ్వీరాజ్. ఇందులో మోహన్‌లాల్‌ కథానాయకుడిగా నటించాడు. ఈ చిత్రం మార్చి 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా కోసం ప్రమోషన్ భారీగానే చెస్తున్నారు మూవీ టీం. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న పుధ్వీరాజ్ సుకుమారన్‌ మలయాళ ఇండస్ట్రీలో ఒత్తిడి గురించి వైరల్ కామెంట్స్ చేశాడు..

Also Read: Kangana Ranaut: తన డ్రీమ్ ఫుల్ ఫీల్ చేసుకున్న కంగనా.. వీడియో వైరల్

చాలా వరకు మిగతా ఇండస్ట్రీలలో ఉన్నంతగా ఓతిడి మాలీవుడ్ లో ఉండదు అంటారు నిజమా? అని ప్రశ్నించడంతో పృథ్వీరాజ్ స్పందిస్తూ.. ‘ మిగతా ఇండస్ట్రీల లాగే మలయాళంలో కూడా సినిమాకి లాభాలు రావడానికి చాలా ఒత్తిడి ఉంటుంది. అంత ఒత్తిడిలో కూడా మాలీవుడ్ గొప్ప సినిమాలు అందిస్తోంది. కానీ మంచి కథలు కాకపోతే ఫ్లాప్ అవ్వడం కాయం అని ప్రేక్షకులు ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించారు. ఈ విషయంలో వాళ్లకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఈ కారణంగా గత కొంత కాలంగా నటీనటులు ఎవరు? దర్శకుడు ఎవరు? అనే దానితో సంబంధం లేకుండా మంచి సినిమాలు భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి. మేము విజయం సాధించాం అనడానికి ఇదే నిదర్శనం. కథ బాగుంటే హీరో ఎవరనేదానితో సంబంధం లేకుండా మూవీ హిట్ అవుతాయి. అందుకే మంచి కథను ఎంచుకుంటే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం. మన పనికి మనం కట్టుబడి ఉంటే తర్వాత ఫలితాన్ని ప్రేక్షకులే అందిస్తారు’ అని పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తెలిపాడు. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.