Site icon NTV Telugu

EMPURAAN : పాన్ ఇండియా డైరెక్టర్ గా మారబోతున్న స్టార్ హీరో.?

Empuraan

Empuraan

కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘లూసిఫర్‌’. 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతూ మలయాళ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ పేరిట రీమేక్ కూడా చేసారు. కానీ ఇక్కడ అంతగా వర్కౌట్ అవ్వలేదు.

Also Read : Pradeep : ఆ యంగ్ హీరో నెక్ట్స్ టార్గెట్ రూ. 200 కోట్లు

కాగా మలయాళం లో లూసిఫర్ ను తెరకెక్కించిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఈ సినిమాకు సిక్వెల్ గా  ఎంపురాన్ -2 (Lucifer -2 )ను తెరకేక్కించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ‘ఎల్2 ఎంపురాన్’ గ్లిమ్స్, పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. మార్చి 27న “ఎల్ -2 ఎంపురాన్” ను పాన్ ఇండియా బాషలలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా ఈ చిత్ర దర్శకుడు, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ గురించి అక్కడి ఇండస్ట్రీలో బిగ్ డిబేట్ జరుగుతుంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ డైరెక్షన్ లో వస్తున్న ఎంపురాన్ సూపర్బ్ గా ఉండబోతుందట. ఈ సినిమా తర్వాత పృథ్వీరాజ్‌ పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచుకుంటాడని మాలీవుడ్ సినీవర్గాలలో చర్చ నడుస్తోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఎంపురాన్ మాలీవుడ్ గత సినిమాల తాలూకు రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న ఎంపురాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పాన్ ఇండియా డైరెక్టర్స్ సరసన చేరతాడని ఆశిద్దాం.

Exit mobile version